📖 Srimad Bhagavad Gita

Srimad Bhagavadgita Chapter 4

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
📜

Sacred Scripture Study & Svadhyaya

Srimad Bhagavad Gita — Authentic Recitation with Sanskrit Verses & Classical Commentary
VERSE #1
శ్రీమద్భగవద్గీత
శ్రీభగవానువాచ |
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే'బ్రవీత్ ||
VERSE #2
శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు: నాశనం లేని ఈ యోగాన్ని నేను మొదట సూర్యుడికి (వివస్వాన్) చెప్పాను. సూర్యుడు తన కుమారుడైన మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు.
ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! ఇలా పరంపరగా వచ్చిన ఈ యోగాన్ని పూర్వం రాజర్షులు తెలుసుకున్నారు. కానీ కాలక్రమేణా ఆ యోగం ఈ లోకంలో నశించిపోయింది.
VERSE #3
స ఏవాయం మయా తే'ద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తో'సి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవు నా భక్తుడవు మరియు ప్రియ మిత్రుడవు కాబట్టి, అత్యంత రహస్యమైన, ఉత్తమమైన ఆ పురాతన యోగాన్నే ఇప్పుడు నీకు తిరిగి ఉపదేశిస్తున్నాను.
VERSE #4
అర్జున ఉవాచ |
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||
📖తాత్పర్యం / Meaning & Significance
అర్జునుడు ఇలా అడిగాడు: “కృష్ణా! సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నీవు ఇప్పుడే పుట్టావు. మరి ఈ యోగాన్ని నీవే మొదట సూర్యుడికి చెప్పావన్న మాటను నేను ఎలా నమ్మాలి?”
VERSE #5
శ్రీభగవానువాచ |
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||
📖తాత్పర్యం / Meaning & Significance
భగవంతుడు ఇలా పలికాడు: “ఓ అర్జునా! నాకు, నీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. వాటన్నింటినీ నేను గుర్తుంచుకోగలను, కానీ నీవు గుర్తుంచుకోలేవు.”
VERSE #6
అజో'పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో'పి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ||
📖తాత్పర్యం / Meaning & Significance
నేను పుట్టుక లేనివాడిని (అజః), నాశనం లేనివాడిని మరియు సర్వ ప్రాణులకు ఈశ్వరుడిని అయినప్పటికీ.. నా ప్రకృతిని (మాయను) ఆధారం చేసుకుని, నా ఆత్మమాయతో నేనే స్వయంగా అవతరిస్తాను.
VERSE #7
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదా''త్మానం సృజామ్యహమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చుమీరుతుందో.. అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను (అవతరిస్తాను).
VERSE #8
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
📖తాత్పర్యం / Meaning & Significance
సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను.
VERSE #9
జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో'ర్జున ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! నా దివ్యమైన జన్మను, కర్మను ఎవరైతే యదార్థంగా (తత్త్వతః) తెలుసుకుంటారో, వారు దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ జన్మించరు; నన్నే చేరుకుంటారు.
VERSE #10
వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
రాగం (ఆశ), భయం, క్రోధం వీడినవారై.. నన్నే ఆశ్రయించి, నా యందే మనస్సు నిలిపిన ఎందరో మహానుభావులు ‘జ్ఞానతపస్సు’ చేత పవిత్రులై నా స్వరూపాన్ని (మద్భావమ్) పొందారు.
VERSE #11
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! నన్ను ఎవరు ఏ విధంగా (ఏ భావంతో) ఆశ్రయిస్తారో, వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మనుషులందరూ అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.
VERSE #12
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ లోకంలో కర్మ ఫలితాలను కోరుకునేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే మనుష్య లోకంలో కర్మల వల్ల కలిగే ఫలితాలు చాలా త్వరగా లభిస్తాయి.
VERSE #13
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
గుణములను, కర్మలను బట్టి నాలుగు వర్ణములను (చాతుర్వర్ణ్యం) నేనే సృష్టించాను. ఆ వ్యవస్థకు కర్తను నేనే అయినప్పటికీ, నన్ను ‘అకర్త’గా (పనుల ఫలితాలకు అంటనివానిగా) మరియు వినాశనం లేనివానిగా తెలుసుకో.
VERSE #14
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో'భిజానాతి కర్మభిర్న స బధ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
నాకు కర్మలు అంటవు, నాకు కర్మ ఫలితాల మీద కోరిక లేదు. నన్ను ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు కూడా తాము చేసే కర్మల బంధనాల్లో చిక్కుకోరు.
VERSE #15
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మోక్షాన్ని కోరిన పూర్వీకులు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకునే కర్మలు చేశారు. కాబట్టి నీవు కూడా నీ పూర్వీకులు అనుసరించిన ఆ నిష్కామ కర్మ మార్గాన్నే అనుసరించు.
VERSE #16
కిం కర్మ కిమకర్మేతి కవయో'ప్యత్ర మోహితాః |
తత్ తే కర్మ ప్రవక్ష్యామి యజ్జ్ఞాత్వా మోక్ష్యసే'శుభాత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఏది కర్మ (చేయదగిన పని)? ఏది అకర్మ (చేయకూడనిది లేదా పని చేయని స్థితి)? అనే విషయంలో విద్వాంసులు, జ్ఞానులు (కవయః) కూడా మోహానికి (అయోమయానికి) లోనవుతుంటారు. కాబట్టి, ఏది తెలుసుకోవడం వల్ల నీవు సంసారమనే అశుభం నుండి (బంధనాల నుండి) విముక్తుడవుతావో, అటువంటి ‘కర్మ తత్త్వాన్ని’ నీకు వివరిస్తాను.
VERSE #17
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ||
📖తాత్పర్యం / Meaning & Significance
కర్మ (చేయదగిన పని), వికర్మ (చేయకూడని పని), అకర్మ (ఫలాపేక్ష లేని పని) – వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం చాలా కష్టం. కర్మ గతి ఎంతో గహనమైనది (లోతైనది).
VERSE #18
కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
కర్మలో అకర్మను (పని చేస్తున్నా ఫలితాన్ని ఆశించని స్థితి), అకర్మలో కర్మను (పని చేయకుండా ఉన్నా లోపల అశాంతిగా ఉండటం వంటి స్థితి) ఎవడైతే చూడగలడో, అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు. అతడే యోగి మరియు అన్ని పనులు సంపూర్ణంగా చేసినవాడు.
VERSE #19
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎవరి ప్రయత్నాలైనా కోరికలు, సంకల్పాలు లేకుండా ఉంటాయో.. అట్టివాని కర్మలు జ్ఞానమనే అగ్నిలో దహించబడతాయి. అట్టివానిని జ్ఞానులు ‘పండితుడు’ అని పిలుస్తారు.
VERSE #20
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభిప్రవృత్తో'పి నైవ కించిత్ కరోతి సః ||
📖తాత్పర్యం / Meaning & Significance
కర్మ ఫలితంపై ఆసక్తిని వదిలేసి, దేనిపైనా ఆధారపడకుండా ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు.. కర్మలలో నిరంతరం నిమగ్నమై ఉన్నా, అతడు ఏమీ చేయనివానితో (అకర్తతో) సమానం.
VERSE #21
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎటువంటి ఆశలు లేనివాడు (నిరాశీః), జయించబడిన మనస్సు మరియు దేహము కలవాడు, మమకారాన్ని (నాది అనే భావాన్ని) పూర్తిగా వదిలేసినవాడు.. కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటే, అతడికి ఎటువంటి పాపము (కిల్బిషమ్) అంటదు.
VERSE #22
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ప్రయత్నం చేయగా దానంతట అది లభించిన దానితో తృప్తి చెందేవాడు (యదృచ్ఛాలాభ సంతుష్టః), సుఖదుఃఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలకు అతీతుడైనవాడు, అసూయ లేనివాడు, విజయం లభించినా లభించకపోయినా సమానంగా ఉండగలిగేవాడు.. కర్మలు చేస్తున్నా వాటి బంధనాల్లో చిక్కుకోడు.
VERSE #23
గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః |
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఆసక్తి లేనివాడు, ముక్తుడైనవాడు, జ్ఞానమునందు స్థిరమైన మనస్సు కలవాడు.. భగవత్ ప్రీతి కోసం (యజ్ఞం కోసం) చేసే కర్మలు పూర్తిగా లీనమైపోతాయి (అంటే అవి పునర్జన్మను ఇచ్చే కర్మఫలాలుగా మారవు).
VERSE #24
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||
📖తాత్పర్యం / Meaning & Significance
అర్పించే పాత్ర బ్రహ్మము, అర్పించే పదార్థము (హవిస్సు) బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసే కర్త బ్రహ్మము. ఇలా ప్రతి కర్మలోనూ బ్రహ్మమునే (పరమాత్మనే) చూస్తూ చేసేవాడు బ్రహ్మమునే పొందుతాడు.
VERSE #25
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
కొందరు యోగులు దేవతలను ఆరాధించడం ద్వారా దైవ యజ్ఞాన్ని చేస్తారు. మరికొందరు పరబ్రహ్మ అనే అగ్నిలో తమ ఆత్మనే అర్పించి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు.
VERSE #26
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
కొందరు తమ ఇంద్రియాలను నిగ్రహం (సంయమనం) అనే అగ్నిలో హోమం చేస్తారు.
VERSE #27
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఇంకొందరు తమ ఇంద్రియ వ్యాపారాలను, ప్రాణ క్రియలను జ్ఞానంతో వెలిగే ఆత్మసంయమ యోగాగ్నిలో సమర్పిస్తారు.
VERSE #28
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
కఠినమైన వ్రతాలు చేసే మునులు ఐదు రకాల యజ్ఞాలను చేస్తారు:
– ద్రవ్య యజ్ఞం: సంపదను ధర్మ కార్యాలకు వినియోగించడం.
– తపో యజ్ఞం: ఇంద్రియ నిగ్రహం కోసం తపస్సు చేయడం.
– యోగా యజ్ఞం: అష్టాంగ యోగాది సాధనలు చేయడం.
– స్వాధ్యాయ యజ్ఞం: వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడం.
– జ్ఞాన యజ్ఞం: పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవడం.
VERSE #29
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే'పానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
మరికొందరు సాధకులు అపాన వాయువులో ప్రాణ వాయువును, ప్రాణ వాయువులో అపాన వాయువును హోమం చేస్తారు. అంటే, శ్వాసను లోపలికి తీసుకోవడం (పూరకం), బయటకు వదలడం (రేచకం) ద్వారా ప్రాణాయామం చేస్తారు. ఇంకా కొందరు ప్రాణ-అపాన గతులను రెండింటినీ స్తంభింపజేసి (కుంభకం), ప్రాణాయామమే పరమావధిగా జీవిస్తారు. ఇది కూడా ఒక రకమైన యజ్ఞమే.
VERSE #30
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |
సర్వే'ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
మరికొందరు ఆహారాన్ని నియంత్రించి (మితాహారులుగా ఉండి), తమ ఇంద్రియ శక్తులను (ప్రాణాలను) ప్రాణమునందే హోమం చేస్తారు. పైన చెప్పిన వివిధ రకాల యజ్ఞాలను చేసేవారందరూ ‘యజ్ఞవిదులు’ (యజ్ఞ తత్త్వాన్ని తెలిసినవారు). వీరందరూ యజ్ఞం ద్వారా తమ పాపాలను (కల్మషములను) కడిగివేసుకున్న పుణ్యాత్ములు.
VERSE #31
యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకో'స్త్యయజ్ఞస్య కుతో'న్యః కురుసత్తమ ||
📖తాత్పర్యం / Meaning & Significance
యజ్ఞం చేయగా మిగిలిన అమృతాన్ని (పవిత్రమైన ప్రసాదాన్ని) స్వీకరించేవారు సనాతన బ్రహ్మమును పొందుతారు. ఓ కురుశ్రేష్ఠా! ఈ లోకంలో యజ్ఞం చేయనివాడికి (త్యాగ గుణం లేనివాడికి) ఇహలోక సుఖమే లేదు, ఇక పరలోక సుఖం ఎక్కడిది?
VERSE #32
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||
📖తాత్పర్యం / Meaning & Significance
వేదములలో ఇలాంటి అనేక యజ్ఞాలు వివరించబడ్డాయి. ఇవన్నీ కర్మల ద్వారానే (శరీర, మనో, వాక్కుల ద్వారా) సాధ్యమని తెలుసుకో. ఇలా తెలుసుకోవడం వల్ల నీవు సంసార బంధం నుండి విముక్తుడవుతావు.
VERSE #33
శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే (వస్తువులను అర్పించడం కంటే) జ్ఞాన యజ్ఞమే చాలా గొప్పది. ఎందుకంటే సమస్త కర్మల యొక్క అంతిమ లక్ష్యం జ్ఞానాన్ని పొందడమే. జ్ఞానం లభించాక కర్మలన్నీ అందులోనే ముగుస్తాయి.
VERSE #34
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఆ జ్ఞానాన్ని నీవు ఎలా పొందాలో తెలుసా? తత్త్వదర్శులైన జ్ఞానులను (గురువులను) ఆశ్రయించి, వారికి వినయంతో నమస్కరించి (ప్రణిపాతేన), నీ సందేహాలను ప్రశ్నించి (పరిప్రశ్నేన) మరియు వారిని సేవించడం (సేవయా) ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకో. అప్పుడు ఆ జ్ఞానులు నీకు పరమ సత్యాన్ని ఉపదేశిస్తారు.
VERSE #35
యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ పాండవా! ఈ తత్త్వ జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు మళ్ళీ ఇటువంటి మోహానికి (అజ్ఞానానికి) లోనుకావు. ఆ జ్ఞానం ద్వారా సమస్త ప్రాణులను నీ ఆత్మలోనూ, ఆపై నాలోనూ (పరమాత్మలో) చూడగలుగుతావు.
VERSE #36
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఒకవేళ నీవు పాపులందరిలోకెల్లా మహాపాపివి అయినప్పటికీ, ఈ ‘జ్ఞానమనే నావ’ (జ్ఞానప్లవము) సహాయంతో పాపసముద్రాన్ని సులభంగా దాటగలవు.
VERSE #37
యథైధాంసి సమిద్ధో'గ్నిర్భస్మసాత్కురుతే'ర్జున |
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! ప్రజ్వరిల్లుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో, అలాగే ‘జ్ఞానమనే అగ్ని’ సమస్త కర్మలను (వాటి ఫలితాలను) భస్మం చేస్తుంది.
VERSE #38
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్ స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ లోకంలో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది మరియొకటి లేదు. నిష్కామ కర్మయోగం ద్వారా సిద్ధుడైనవాడు, కాలక్రమేణా ఆ జ్ఞానాన్ని తన హృదయంలోనే స్వయంగా పొందుతాడు.
VERSE #39
శ్రద్ధావాంల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
శ్రద్ధ కలిగినవాడు, పరమాత్మ యందే నిమగ్నమైనవాడు, ఇంద్రియాలను జయించినవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అట్టి జ్ఞానాన్ని పొందిన వెంటనే అతడు పరమ శాంతిని (పరాం శాంతిమ్) పొందుతాడు.
VERSE #40
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో'స్తి న పరో న సుఖం సంశయాత్మనః ||
📖తాత్పర్యం / Meaning & Significance
జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, ఎప్పుడూ అనుమానించేవాడు (సంశయాత్ముడు) నాశనమైపోతాడు. సంశయం ఉన్నవానికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలోనూ ఉండదు.
VERSE #41
యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ ధనంజయా! ఎవరైతే యోగం ద్వారా కర్మలను భగవంతుడికి అర్పించారో, జ్ఞానం ద్వారా సంశయాలను తొలగించుకున్నారో, అట్టి ఆత్మజ్ఞానిని కర్మలు బంధించవు.
VERSE #42
తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినా''త్మనః |
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ||
📖తాత్పర్యం / Meaning & Significance
కాబట్టి ఓ భారత! నీ హృదయంలో ఉన్న అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాన్ని ‘జ్ఞానమనే కత్తి’ (జ్ఞానాసినా) తో ఛేదించి, యోగ ధర్మాన్ని ఆశ్రయించి.. యుద్ధానికి సిద్ధమవ్వు (ఉత్తిష్ఠ – లెమ్ము).
VERSE #43
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానయోగో నామ చతుర్థో'ధ్యాయః ||
📖తాత్పర్యం / Meaning & Significance
పంచమో'ధ్యాయః – సన్న్యాసయోగః
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ
VERSE #44
శ్రీమద్భగవద్గీత
🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Srimad Bhagavadgita Chapter 4 represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.