📖 Srimad Bhagavad Gita

Srimad Bhagavadgita Chapter 18

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
📜

Sacred Scripture Study & Svadhyaya

Srimad Bhagavad Gita — Authentic Recitation with Sanskrit Verses & Classical Commentary
VERSE #1
అర్జున ఉవాచ |సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ||
📖తాత్పర్యం / Meaning & Significance
అర్జునుడు అడిగాడు: ఓ మహాబాహో! హృషీకేశా! కేశినిషూదనా! ‘సంన్యాసం’ యొక్క తత్త్వాన్ని మరియు ‘త్యాగం’ యొక్క తత్త్వాన్ని వేర్వేరుగా (పృథక్) తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
VERSE #2
శ్రీభగవానువాచ |కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః |సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ||
VERSE #3
శ్రీ భగవానుడు పలికెను: కోరికలతో చేసే కర్మలను వదిలివేయడాన్ని (కామ్య కర్మ న్యాసం) ‘సంన్యాసం’ అని పండితులు అంటారు. చేసే అన్ని పనుల యొక్క ఫలితాన్ని వదిలివేయడాన్ని (సర్వకర్మ ఫలత్యాగం) ‘త్యాగం’ అని విజ్ఞులు చెబుతారు.
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ||
📖తాత్పర్యం / Meaning & Significance
కొందరు పండితులు కర్మలన్నీ దోషపూరితమైనవి కాబట్టి వాటిని వదిలేయాలి అంటారు. మరికొందరు యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను ఎన్నటికీ వదలకూడదు అని అంటారు.
VERSE #4
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ భరతశ్రేష్ఠా! త్యాగం విషయంలో నా నిశ్చయాన్ని విను. ఓ పురుషవ్యాఘ్ర! త్యాగం అనేది సత్త్వ, రజ, తమో గుణాల భేదం చేత మూడు రకాలుగా చెప్పబడింది.
VERSE #5
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను ఎన్నటికీ వదలకూడదు. అవి తప్పక ఆచరించవలసినవి (కార్యమేవ తత్). ఎందుకంటే యజ్ఞ దాన తపస్సులు జ్ఞానులను సైతం పవిత్రులను చేస్తాయి.
VERSE #6
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
అయితే, ఈ పనులను కూడా కర్తృత్వ భావన (నేను చేస్తున్నాను అనే అహంకారం) లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేయాలన్నదే నా ఖచ్చితమైన మరియు ఉత్తమమైన అభిప్రాయం.
VERSE #7
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే |మోహాత్ తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ||
📖తాత్పర్యం / Meaning & Significance
శాస్త్రరీత్యా నిర్దేశించబడిన కర్తవ్య కర్మలను (నియత కర్మలను) వదిలివేయడం తగదు. అజ్ఞానం లేదా మోహం వల్ల అటువంటి పనులను మానేస్తే, దానిని ‘తామస త్యాగం’ అంటారు. ఇది మనిషిని అధోగతికి తీసుకెళ్తుంది.
VERSE #8
దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ |స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఏదైనా పని చేయడం కష్టమని (దుఃఖము), శరీరం శ్రమ పడుతుందని భయపడి (కాయక్లేశ భయాత్) కర్తవ్యాన్ని వదిలివేస్తే, అది ‘రాజస త్యాగం’ అవుతుంది. అటువంటి వాడు త్యాగం వల్ల కలిగే ఫలితాన్ని (చిత్తశుద్ధిని) పొందలేడు.
VERSE #9
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే'ర్జున |సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! ఈ పని చేయడం నా బాధ్యత అని భావించి, సంగత్వమును (మమకారాన్ని) మరియు కర్మ ఫలితాన్ని వదిలిపెట్టి చేసే త్యాగమే ‘సాత్త్విక త్యాగం’. ఇది శ్రేష్ఠమైనది.
VERSE #10
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ||
📖తాత్పర్యం / Meaning & Significance
సాత్త్విక గుణంతో నిండినవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, సందేహాలు లేనివాడు అయిన త్యాగి… తనకు నచ్చని పని (అకుశలం) ఎదురైనప్పుడు ద్వేషించడు, నచ్చిన పని (కుశలం) ఎదురైనప్పుడు ఆసక్తి పెంచుకోడు. అతడు రెండింటినీ సమానంగా చూస్తాడు.
VERSE #11
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః |యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
దేహాన్ని ధరించిన ఏ మానవుడూ కర్మలను సంపూర్ణంగా వదిలివేయడం సాధ్యం కాదు (కనీసం శ్వాస తీసుకోవడం, తినడం వంటివి కూడా కర్మలే). కాబట్టి, ఎవరైతే కర్మల యొక్క ఫలితాన్ని వదులుతారో, అతడే నిజమైన త్యాగి అని పిలవబడతాడు.
VERSE #12
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ |భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
కర్మ ఫలాలను త్యాగం చేయని వారికి (అత్యాగినామ్) మరణానంతరం మూడు రకాల ఫలితాలు ఉంటాయి: అనిష్టం (నరకాది దుఃఖాలు), ఇష్టం (స్వర్గాది సుఖాలు), మిశ్రం (సుఖదుఃఖాలు కలగలిసిన మానవ జన్మ). కానీ కర్మ ఫలాలను త్యాగం చేసిన సన్న్యాసులకు ఎప్పుడూ ఇటువంటి బంధనాలు ఉండవు.
VERSE #13
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ మహాబాహో! సాంఖ్య శాస్త్రం ప్రకారం ఏ కర్మ సిద్ధించడానికైనా ఐదు కారణాలు అవసరమని చెప్పబడింది.
VERSE #14
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
1. అధిష్ఠానం: కర్మ జరగడానికి ఆధారమైన శరీరం.2. కర్త: అహంకారంతో కూడిన జీవుడు.3. కరణం: పనులు చేయడానికి ఉపయోగపడే వివిధ ఇంద్రియాలు (కళ్లు, కాళ్లు, మనస్సు మొదలైనవి).4. చేష్టా: ఆయా పనుల కోసం చేసే రకరకాల ప్రయత్నాలు.5. దైవం: పైన చెప్పిన నాలుగు ఉన్నా, పని పూర్తి కావడానికి కావలసిన దైవబలం (ప్రారబ్ధం లేదా పరమాత్మ సంకల్పం).
VERSE #15
శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః |న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ||
📖తాత్పర్యం / Meaning & Significance
మనిషి తన శరీరం, మాట లేదా మనస్సుతో చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ పనికైనా ఈ ఐదే కారణాలు.
VERSE #16
తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః |పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః ||
📖తాత్పర్యం / Meaning & Significance
పనులు జరగడానికి ఐదు కారణాలు ఉండగా, కేవలం తనను తాను (ఆత్మను) మాత్రమే కర్తగా భావించేవాడు మందబుద్ధి. అటువంటి వాడు సత్యాన్ని చూడలేడు.
VERSE #17
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |హత్వా'పి స ఇమాన్ లోకాన్న హంతి న నిబధ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎవడైతే నేను కర్తను అనే అహంకారం లేకుండా ఉంటాడో, ఎవడి బుద్ధి కర్మ ఫలాలకు అంటదో.. అటువంటి వాడు లోక రీత్యా యుద్ధం చేసి శత్రువులను చంపినా, అతడు చంపినవాడు కాడు, ఆ కర్మ బంధాల్లో చిక్కుకోడు.
VERSE #18
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా |కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ||
📖తాత్పర్యం / Meaning & Significance
జ్ఞానము (తెలివి), జ్ఞేయము (తెలుసుకోవలసిన విషయం), పరిజ్ఞాత (తెలుసుకునేవాడు) – ఈ మూడూ కర్మకు ప్రేరణనిస్తాయి. అలాగే కరణము (పనిముట్టు), కర్మ (పని), కర్త (చేసేవాడు) – ఈ మూడూ కర్మ యొక్క స్వరూపాన్ని (సంగ్రహాన్ని) ఏర్పరుస్తాయి.
VERSE #19
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః |ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ||
📖తాత్పర్యం / Meaning & Significance
సాంఖ్య శాస్త్రం (గుణసంఖ్యానే) ప్రకారం… జ్ఞానము, కర్మ మరియు కర్త – ఈ మూడూ కూడా మూడు గుణాల ప్రభావం వల్ల మూడు రకాలుగా విభజించబడ్డాయి. వాటి గురించి కూడా నేను చెప్పినట్లుగా (యథావత్) విను.
VERSE #20
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
విభజింపబడిన (వేరువేరుగా కనిపిస్తున్న) సమస్త ప్రాణులలో… నాశనం లేని (అవ్యయం), అద్వైతమైన (ఒక్కటే అయిన) పరమాత్మ తత్త్వాన్ని ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి చూడగలుగుతాడో, దానిని ‘సాత్త్విక జ్ఞానం’ అని తెలుసుకో.
VERSE #21
పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ |వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఏ జ్ఞానం వల్ల మనిషి ప్రాణులన్నీ ఒకదానికొకటి వేరని, ప్రతి శరీరంలోనూ వేర్వేరు ఆత్మలు ఉన్నాయని (భేద భావంతో) చూస్తాడో.. అది ‘రాజస జ్ఞానం’.
VERSE #22
యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |అతత్త్వార్థవదల్పం చ తత్ తామసముదాహృతమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
కేవలం ఏదో ఒక చిన్న పనికే అతుక్కుపోయి, కారణం లేకుండా, సత్యం తెలియకుండా, అది మాత్రమే సర్వస్వమని భావించే అల్పమైన జ్ఞానం ‘తామస జ్ఞానం’.
VERSE #23
నియతం సంగరహితమరాగద్వేషతః కృతమ్ |అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
శాస్త్రబద్ధమైనది (నియతం), అహంకారం లేకుండా చేసేది (సంగరహితం), ఇష్టాఇష్టాలకు (రాగద్వేషాలకు) అతీతంగా చేసేది మరియు ఫలాపేక్ష లేకుండా చేసే పనిని ‘సాత్త్విక కర్మ’ అంటారు.
VERSE #24
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
కోరికలతో (కామేప్సునా), అహంకారంతో (సాహంకారేణ) మరియు మిక్కిలి శ్రమతో (బహులాయాసం) చేసే పనిని ‘రాజస కర్మ’ అంటారు.
VERSE #25
అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
భవిష్యత్తులో కలిగే పర్యవసానాలను (అనుబంధం), అయ్యే నష్టాన్ని (క్షయం), ఎదుటివారికి కలిగే హింసను మరియు తన సామర్థ్యాన్ని (పౌరుషం) ఆలోచించకుండా, కేవలం మోహంతో మొదలుపెట్టే పనిని ‘తామస కర్మ’ అంటారు.
VERSE #26
ముక్తసంగో'నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఆసక్తి లేనివాడు (ముక్తసంగః), అహంకారం లేనివాడు, ధైర్యసాహసాలతో (ధృత్యుత్సాహ) కూడినవాడు, పని సిద్ధించినా సిద్ధించకపోయినా వికారాలకు (దుఃఖానికి లేదా అతి సంతోషానికి) లోనుకాకుండా ఉండేవాడు ‘సాత్త్విక కర్త’.
VERSE #27
రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో'శుచిః |హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ||
📖తాత్పర్యం / Meaning & Significance
అనురాగం కలవాడు (రాగీ), కర్మ ఫలితాలను ఆశించేవాడు, లోభి, హింసా స్వభావం కలవాడు, అపవిత్రుడు (అశుచిః), సుఖదుఃఖాలకు త్వరగా చలించేవాడు (హర్షశోకాన్వితః) ‘రాజస కర్త’.
VERSE #28
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో'లసః |విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
అస్థిరమైన మనస్సు కలవాడు (అయుక్తః), వివేకం లేనివాడు (ప్రాకృతః), మొండివాడు (స్తబ్ధః), మోసగాడు (శఠః), ఇతరులను అవమానించేవాడు, సోమరి (అలసః), ఎప్పుడూ విచారించేవాడు (విషాదీ) మరియు పనులను వాయిదా వేసేవాడు (దీర్ఘసూత్రీ) ‘తామస కర్త’.
VERSE #29
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ ధనంజయా! బుద్ధి మరియు ధృతి (ధైర్యం) లో ఉన్న మూడు రకాల భేదాలను విను. ఏ బుద్ధి అయితే …
VERSE #30
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
… ఏ పని చేయాలి (ప్రవృత్తి), ఏ పని చేయకూడదు (నివృత్తి), ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఏది బంధనం, ఏది మోక్షం అని స్పష్టంగా తెలుసుకుంటుందో.. అది ‘సాత్త్విక బుద్ధి’.
VERSE #31
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ పార్థా! ఏ బుద్ధి అయితే ధర్మానికి-అధర్మానికి మధ్య, చేయవలసిన పనికి (కార్యం)-చేయకూడని పనికి (అకార్యం) మధ్య ఉన్న తేడాను సరిగా గుర్తించలేదో (అయథావత్), అది ‘రాజస బుద్ధి’. ఇది గందరగోళంతో కూడి ఉంటుంది.
VERSE #32
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా''వృతా |సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ పార్థా! అజ్ఞానమనే చీకటితో నిండిన ఏ బుద్ధి అయితే.. అధర్మాన్ని ధర్మమని భావిస్తుందో, అలాగే అన్ని విషయాలను వ్యతిరేకంగా (విపరీతంగా) అర్థం చేసుకుంటుందో, అది ‘తామస బుద్ధి’.
VERSE #33
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఏకాగ్రతతో కూడిన యోగ సాధన ద్వారా… మనస్సు, ప్రాణము, ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచి, సరైన మార్గంలో నడిపించే నిశ్చయ శక్తిని ‘సాత్త్విక ధృతి’ అంటారు.
VERSE #34
యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే'ర్జున |ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! ఫలాన్ని ఆశించి, ఆసక్తితో ధర్మ, అర్థ, కామాలను (లౌకిక ప్రయోజనాలను) మాత్రమే పట్టుకుని ఉండటానికి ఉపయోగపడే నిశ్చయ శక్తి ‘రాజస ధృతి’.
VERSE #35
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
దుర్బుద్ధి గలవాడు దేనినైతే ఆశ్రయించి.. నిద్ర, భయం, శోకం, విషాదం మరియు గర్వాన్ని వదలడో, అటువంటి మొండితనాన్ని ‘తామస ధృతి’ అంటారు.
VERSE #36
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ భరతశ్రేష్ఠా! అభ్యాసం (సాధన) ద్వారా అలవడేది, దుఃఖాలను అంతం చేసేది అయిన సుఖం సాత్త్వికమైనది.
VERSE #37
యత్తదగ్రే విషమివ పరిణామే'మృతోపమమ్ |తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఇది మొదట విషం వలె కష్టంగా అనిపించినా, ఫలితంలో అమృతం వలె ఉంటుంది. ఆత్మజ్ఞానం వల్ల కలిగే ప్రశాంతతే ఈ సుఖానికి మూలం.
VERSE #38
విషయేంద్రియసంయోగాద్యత్తదగ్రే'మృతోపమమ్ |పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఇంద్రియాలు విషయాలతో (వస్తువులు, భోగాలు) కలవడం వల్ల కలిగే సుఖం రాజసమైనది. ఇది మొదట అమృతం వలె తీయగా అనిపించినా, చివరకు విషం వలె దుఃఖాన్ని మిగులుస్తుంది.
VERSE #39
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |నిద్రాలస్యప్రమాదోత్థం తత్ తామసముదాహృతమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మొదటి నుండి చివరి వరకు ఆత్మను మోహానికి గురిచేసేది, నిద్ర, బద్ధకం (ఆలస్యం), అజాగ్రత్త (ప్రమాదం) నుండి పుట్టే సుఖం ‘తామస సుఖం’.
VERSE #40
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః |సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ భూమి మీద గానీ, స్వర్గంలో దేవతలలో గానీ… ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాల (సత్వ, రజ, తమస్సు) ప్రభావం లేని ప్రాణి ఏదీ లేదు.
VERSE #41
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప |కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ పరంతప! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రుల యొక్క కర్మలు వారి వారి అంతర్గత గుణాల నుండి పుట్టిన స్వభావాల ప్రకారమే విభజించబడ్డాయి.
VERSE #42
శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ |జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మనస్సును నిగ్రహించడం (శమము), ఇంద్రియాలను అదుపు చేయడం (దమము), తపస్సు, బాహ్య-అంతర శుచి, ఓర్పు (క్షాంతి), నిష్కపటమైన ప్రవర్తన, శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం (విజ్ఞానము), దైవ చింతన (ఆస్తిక్యము) – ఇవి బ్రాహ్మణుని సహజ గుణాలు.
VERSE #43
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
VERSE #44
కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం (వ్యాపారం) – ఇవి వైశ్యుని సహజ కర్మలు. ఇతరులకు సేవ చేయడం లేదా పరిచర్య చేయడం అనేది శూద్రుని సహజ కర్మ.
VERSE #45
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ||
📖తాత్పర్యం / Meaning & Significance
తమ తమ స్వభావానికి తగిన పనులలో నిమగ్నమైన వారు పరమ సిద్ధినీ (జ్ఞానాన్ని) పొందుతారు. సర్వ ప్రాణులకూ మూలమైనవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు అయిన ఆ పరమాత్మను …
VERSE #46
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ||
📖తాత్పర్యం / Meaning & Significance
… మనిషి తాను చేసే పనుల ద్వారానే అర్చించి (పూజించి) మోక్షాన్ని పొందవచ్చు. అంటే మనం చేసే వృత్తిని దైవ కార్యంగా భావించాలి.
VERSE #47
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
చక్కగా ఆచరించిన పరధర్మం కంటే, లోపాలు ఉన్నప్పటికీ తన స్వధర్మాన్ని (తన స్వభావానికి తగిన పనిని) ఆచరించడమే మేలు. తన స్వభావానికి తగిన పనిని చేయడం వల్ల మనిషికి ఎటువంటి పాపము అంటదు.
VERSE #48
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ |సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ కౌంతేయా! సహజమైన కర్మలో లోపాలు ఉన్నప్పటికీ దానిని వదలకూడదు. అగ్నిని పొగ కప్పి ఉంచినట్లే, మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక లోపం (దోషం) ఖచ్చితంగా ఉంటుంది.
VERSE #49
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః |నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్ఛతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
అన్ని విషయాలలో ఆసక్తి లేని బుద్ధి కలవాడు, జితాత్ముడు (మనస్సును గెలిచినవాడు), కోరికలు లేనివాడు అయిన సాధకుడు.. కర్మ ఫలాలను త్యాగం చేయడం ద్వారా (సంన్యాసము) అత్యున్నతమైన ‘నైష్కర్మ్య సిద్ధిని’ పొందుతాడు. అంటే అతడు పనులు చేస్తున్నా వాటికి కట్టుబడడు.
VERSE #50
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా''ప్నోతి నిబోధ మే |సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ కౌంతేయా! ఇటువంటి సిద్ధిని పొందిన వాడు, జ్ఞానానికి అత్యున్నతమైన పరమ నిష్ఠ అయిన ‘బ్రహ్మము’ను (పరమాత్మను) ఎలా పొందుతాడో ఇప్పుడు క్లుప్తంగా నా నుండి విను.
VERSE #51
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యా''త్మానం నియమ్య చ |శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
సత్వగుణంతో కూడిన నిర్మలమైన బుద్ధిని కలిగి, ధైర్యంతో మనస్సును నిగ్రహించుకుని, శబ్ద స్పర్శాది ఇంద్రియ విషయాలను (భోగాలను) వదిలిపెట్టి, వేటిపైనా ఇష్టాఇష్టాలు (రాగద్వేషాలు) లేకుండా ఉన్నవాడు…
VERSE #52
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఏకాంత ప్రదేశంలో నివసిస్తూ, మితాహారం తీసుకుంటూ, తన వాక్కును, శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకుని, నిరంతరం ధ్యానయోగంలో నిమగ్నమై, దృఢమైన వైరాగ్యాన్ని ఆశ్రయించినవాడు…
VERSE #53
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ||
📖తాత్పర్యం / Meaning & Significance
అహంకారం, గర్వం, కామక్రోధాలు, అవసరం లేని వస్తువులను సేకరించడం (పరిగ్రహం) వంటివి పూర్తిగా వదిలేసి, నాది అనే మమకారం లేకుండా, శాంతంగా ఉన్న సాధకుడు బ్రహ్మ భావాన్ని పొందడానికి (అంటే పరమాత్మలో ఐక్యమవ్వడానికి) అర్హుడవుతాడు.
VERSE #54
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి |సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఆ విధంగా బ్రహ్మ స్థితిని పొందినవాడు ఎప్పుడూ ఆనందంగా (ప్రసన్నాత్మ) ఉంటాడు. అతడు దేనికోసం బాధపడడు, దేనినీ కోరడు. అన్ని ప్రాణులను సమానంగా చూస్తూ, నా యందు పరమ భక్తిని కలిగి ఉంటాడు.
VERSE #55
భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వతః |తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
అటువంటి అనన్య భక్తి ద్వారా మాత్రమే నేను ఎవరు, నా వాస్తవ రూపం ఏమిటి అనేది అతడు నిజంగా (తత్త్వతః) తెలుసుకోగలడు. నన్ను అలా తెలుసుకున్న మరుక్షణమే అతడు నాయందు ప్రవేశిస్తాడు (మోక్షం పొందుతాడు).
VERSE #56
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎల్లప్పుడూ అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ, నన్నే నమ్ముకుని, నాకే శరణు కోరినవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతమైన, నాశనం లేని పరమ పదాన్ని (వైకుంఠం/మోక్షం) పొందుతాడు.
VERSE #57
చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః |బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీ మనస్సుతో అన్ని పనులను నాకు అర్పించి, నన్నే నీ పరమ గమ్యంగా భావించు. బుద్ధియోగాన్ని ఆశ్రయించి, నీ చిత్తాన్ని (మనస్సును) నిరంతరం నాయందే నిలుపు.
VERSE #58
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి |అథ చేత్ త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీ మనస్సు నాయందు లగ్నం చేస్తే, నా కృప వల్ల నీవు జీవితంలోని అన్ని కష్టాలను (సర్వదుర్గాణి) సులభంగా దాటుతావు. అలా కాకుండా అహంకారంతో నా మాట వినకపోతే నీవు పతనం చెందుతావు.
VERSE #59
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవు అహంకారంతో నేను యుద్ధం చేయను అని నిర్ణయించుకున్నా, అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే నీలోని క్షత్రియ స్వభావమే (ప్రకృతి) నిన్ను బలవంతంగా యుద్ధంలోకి దింపుతుంది.
VERSE #60
స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో'పి తత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ కౌంతేయా! మోహం వల్ల నీవు ఏ పనినైతే చేయనని అంటున్నావో, నీ స్వభావం నుండి పుట్టిన కర్మకు కట్టుబడి ఉన్న నీవు.. నీ ప్రమేయం లేకుండానే (అవశో'పి) ఆ పనిని చేసి తీరుతావు.
VERSE #61
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే'ర్జున తిష్ఠతి |భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అర్జునా! పరమాత్మ సమస్త ప్రాణుల హృదయాలలో నివసించి ఉంటాడు. ఒక యంత్రం మీద ఎక్కిన బొమ్మలను సూత్రధారి ఆడించినట్లుగా, ఆయన తన మాయాశక్తితో ప్రాణులందరినీ వారి కర్మలను బట్టి భ్రమింపజేస్తుంటాడు.
VERSE #62
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ భారతా! నీవు అన్ని విధాలా (మనస్సు, వాక్కు, కర్మలతో) ఆ పరమాత్మనే శరణు వేడుకో. ఆయన అనుగ్రహం వల్ల నీవు పరమ శాంతిని మరియు శాశ్వతమైన పరమ పదమును (మోక్షాన్ని) పొందుతావు.
VERSE #63
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా |విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||
📖తాత్పర్యం / Meaning & Significance
రహస్యాలన్నిటిలోకీ అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని నేను నీకు వివరించాను. దీనిని సంపూర్ణంగా విచారించి (ఆలోచించి), ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేయి. (భగవంతుడు ఇక్కడ మనిషికి ఉన్న ‘స్వేచ్ఛా సంకల్పాన్ని’ గౌరవిస్తున్నారు).
VERSE #64
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |ఇష్టో'సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
అన్నిటికంటే రహస్యమైన నా పరమ సందేశాన్ని మరొక్కసారి విను. నీవు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడవు కాబట్టి, నీ హితము కోరి దీనిని చెబుతున్నాను.
VERSE #65
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో'సి మే ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీ మనస్సును నాయందే నిలుపు, నా భక్తుడవు కా, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా చేస్తే నీవు తప్పక నన్నే చేరుకుంటావు. నీవు నాకు ఇష్టుడవు కాబట్టి ఇది నేను నీకు చేస్తున్న సత్యప్రమాణం.
VERSE #66
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
📖తాత్పర్యం / Meaning & Significance
సమస్త ధర్మాలను (నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను, ఇతర ఆశ్రయాలను) వదిలిపెట్టి, కేవలం నన్ను మాత్రమే శరణు వేడుకో. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఏమాత్రం భయపడకు, శోకించకు.
VERSE #67
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో'భ్యసూయతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ పరమ రహస్యమైన జ్ఞానాన్ని తపస్సు లేనివానికి, భక్తి లేనివానికి, వినాలని ఆసక్తి లేనివానికి మరియు నన్ను ద్వేషించేవానికి ఎప్పుడూ చెప్పవద్దు.
VERSE #68
య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎవరైతే ఈ పరమ రహస్యమైన గీతా జ్ఞానాన్ని నా భక్తులకు బోధిస్తారో, వారు నా యందు పరమ భక్తిని కలిగి ఉండి నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు.
VERSE #69
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః |భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ లోకంలో మనుష్యులందరిలోనూ అటువంటి వానికంటే నాకు అత్యంత ప్రియమైన వాడు మరొకడు లేడు, భవిష్యత్తులో ఉండబోడు.
VERSE #70
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః |జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ||
📖తాత్పర్యం / Meaning & Significance
మన ఇద్దరి మధ్య జరిగిన ఈ ధర్మబద్ధమైన సంవాదాన్ని (గీతను) ఎవరైతే అధ్యయనం చేస్తారో, వారు నన్ను ‘జ్ఞానయజ్ఞం’ ద్వారా పూజించినట్లు నేను భావిస్తాను. ఇది నా నిశ్చితాభిప్రాయం.
VERSE #71
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |సో'పి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఏ మనిషైతే అసూయ లేకుండా, కేవలం శ్రద్ధతో ఈ గీతా సంవాదాన్ని వింటాడో… అటువంటి వాడు కూడా పాప విముక్తుడై, పుణ్యాత్ములు పొందే శుభప్రదమైన లోకాలను చేరుకుంటాడు.
VERSE #72
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ పార్థా! నీవు ఏకాగ్రతతో ఈ జ్ఞానాన్ని విన్నావా? ఓ ధనంజయా! అజ్ఞానం వల్ల కలిగిన నీ మోహం (భ్రమ) ఇప్పుడు నశించిందా?
VERSE #73
అర్జున ఉవాచ |నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |స్థితో'స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ అచ్యుతా! నీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానము నశించింది. నేను కోల్పోయిన జ్ఞానాన్ని (స్మృతిని) తిరిగి పొందాను. నా సందేహాలన్నీ తొలగిపోయాయి, ఇప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. నీవు చెప్పినట్లే చేస్తాను (కరిష్యే వచనం తవ).
VERSE #74
సంజయ ఉవాచ |ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: ఈ విధంగా మహాత్ముడైన అర్జునుడికి, వాసుదేవునికి మధ్య జరిగిన అత్యంత అద్భుతమైన, రోమాంచితమైన సంవాదాన్ని నేను విన్నాను.
VERSE #75
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్ |యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల (దివ్య దృష్టి ద్వారా) యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతుండగా ఈ పరమ రహస్యమైన యోగాన్ని నేను వినగలిగాను.
VERSE #76
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ |కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ రాజా! కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ పుణ్యప్రదమైన, అద్భుతమైన సంవాదాన్ని గుర్తుకు తెచ్చుకున్న కొద్దీ నేను మళ్ళీ మళ్ళీ పులకించిపోతున్నాను.
VERSE #77
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః ||
📖తాత్పర్యం / Meaning & Significance
అలాగే, శ్రీహరి చూపిన ఆ అత్యంత అద్భుతమైన (విశ్వరూపం) రూపాన్ని తలచుకుంటే నాకు గొప్ప ఆశ్చర్యం కలుగుతోంది, నేను మాటిమాటికీ ఆనందిస్తున్నాను.
VERSE #78
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో… అక్కడ సంపద (శ్రీ), విజయము, విభూతి (ఐశ్వర్యం) మరియు స్థిరమైన నీతి ఉంటాయని నా నిశ్చితాభిప్రాయం.
VERSE #79
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసంన్యాసయోగో నామ అష్టాదశో'ధ్యాయః ||
🪷

శ్రీ గీతా మాహాత్మ్యం>>

🪷

శ్రీ కృష్ణ

🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Srimad Bhagavadgita Chapter 18 represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.