శ్రీమద్భగవద్గీత
ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: “ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమకూడిన నా కుమారులు (కౌరవులు), పాండుపుత్రులు (పాండవులు) ఏం చేశారు?”
సంజయ ఉవాచ |
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయుడు ఇలా అన్నాడు: “రాజా! వ్యూహరచనతో ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు, అప్పుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పాడు.”
పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
“ఈ సైన్యంలో గొప్ప విలుకాండ్రు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైన శూరులు ఉన్నారు. వారు – యుయుధానుడు (సాత్యకి), విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదుడు.”
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||
“అలాగే ధృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు నరశ్రేష్ఠుడైన శైబ్యుడు కూడా ఉన్నారు.”
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
“పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలశాలియైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు (అభిమన్యుడు), ద్రౌపది కుమారులు (ఉపపాండవులు) – వీరందరూ మహారథులే.”
అస్మాకం తు విశిష్టా యే తాన్ నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||
“ద్విజోత్తమా! మన పక్షంలో ఉన్న విశిష్టులైన వారిని కూడా తెలుసుకోండి. మీ అవగాహన కోసం నా సైన్యంలోని నాయకుల పేర్లను మీకు చెబుతాను.”
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
“మీరు (ద్రోణులు), భీష్ముడు, కర్ణుడు, యుద్ధవిజేతయైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవసుడు.”
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||
“వీరే కాక నా కోసం ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడిన వారు, రకరకాల ఆయుధాలు ధరించిన వారు, యుద్ధవిద్యలో ఆరితేరిన శూరులు ఇంకా ఎంతోమంది ఉన్నారు.”
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||
“భీష్ముడి రక్షణలో ఉన్న మన సైన్యం అపారమైనది (లేదా జయించలేనిది), కానీ భీముడి రక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితమైనది (లేదా సులభంగా జయించదగినది).”
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ||
“కాబట్టి మీరందరూ మీ మీ స్థానాల్లో (వ్యూహాలలో) ఉండి, అన్ని వైపుల నుండి భీష్ముడినే కాపాడాలి.”
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
“అప్పుడు కౌరవ వృద్ధుడు, ప్రతాపవంతుడైన పితామహ భీష్ముడు దుర్యోధనుడికి సంతోషం కలిగించడానికి సింహనాదం చేస్తూ, బిగ్గరగా శంఖాన్ని పూరించాడు.”
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో'భవత్ ||
“వెంటనే శంఖాలు, భేరీలు, తమ్మటలు, నగారాలు, కొమ్ములు ఒకేసారి మ్రోగాయి. ఆ శబ్దం చాలా భయంకరంగా మిన్నంటింది.”
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
“ఆ తర్వాత తెల్లని గుర్రాలు కట్టిన గొప్ప రథం మీద కూర్చున్న శ్రీకృష్ణుడు (మాధవుడు), అర్జునుడు (పాండవుడు) తమ దివ్యమైన శంఖాలను పూరించారు.”
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||
“శ్రీకృష్ణుడు ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని, అర్జునుడు ‘దేవదత్తం’ అనే శంఖాన్ని, భయంకరమైన పనులు చేసే భీమసేనుడు ‘పౌండ్రం’ అనే మహా శంఖాన్ని పూరించారు.”
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||
కుంతీపుత్రుడైన ధర్మరాజు ‘అనంతవిజయం’ అనే శంఖాన్ని, నకులుడు ‘సుఘోషం’ అనే శంఖాన్ని, సహదేవుడు ‘మణిపుష్పకం’ అనే శంఖాన్ని పూరించారు.
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||
ఓ రాజా! గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు మరియు మహాబాహువు గల సుభద్రా పుత్రుడు (అభిమన్యుడు) – వీరందరూ అన్ని వైపుల నుండి తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు.
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||
ఆ భయంకరమైన శంఖధ్వని ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనింపజేస్తూ, యుద్ధానికి సిద్ధమైన ధృతరాష్ట్రుని కుమారుల (కౌరవుల) గుండెలను పగులజేసింది.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
ఓ రాజా! ఆ సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్రుని కుమారులను చూసి, కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సును పైకెత్తి, యుద్ధం ప్రారంభం కావడానికి ముందే శ్రీకృష్ణుడితో (హృషీకేశుడితో) ఈ విధంగా అన్నాడు.
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే'చ్యుత ||
యావదేతాన్ నిరీక్షే'హం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||
అర్జునుడు ఇలా అన్నాడు: “ఓ అచ్యుతా! యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ నిలబడి ఉన్న వీరిని నేను చూసే వరకు, ఈ రణరంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో తెలుసుకునే వరకు, నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపండి.”
యోత్స్యమానానవేక్షే'హం య ఏతే'త్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||
“దుర్బుద్ధి గల దుర్యోధనుడికి ప్రియం చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన వారిని నేను చూడాలనుకుంటున్నాను.”
సంజయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||
సంజయుడు ఇలా అన్నాడు: “ఓ రాజా! అర్జునుడు (గుడాకేశుడు) చెప్పిన మాట విని, శ్రీకృష్ణుడు ఆ ఉత్తమమైన రథాన్ని రెండు సైన్యాల మధ్య, భీష్మ ద్రోణులు మరియు మిగిలిన రాజులందరి ముందు నిలిపి, ‘పార్థా! ఇక్కడ సమావేశమైన ఈ కురువంశీయులను చూడు’ అని అన్నాడు.”
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ||
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ||
అప్పుడు అర్జునుడు అక్కడ నిలబడి ఉన్న తన తండ్రి సమానులను (పినతండ్రి, పెదతండ్రులను), తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను మరియు హితులను చూశాడు. రెండు సైన్యాలలో ఉన్న తన బంధువులందరినీ చూసిన అర్జునుడు (కుంతీపుత్రుడు) అత్యంత వ్యాకులతకు లోనయ్యాడు.
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||
మిక్కిలి జాలితో నిండినవాడై, దుఃఖిస్తూ అర్జునుడు ఇలా అన్నాడు: “కృష్ణా! యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ నిలబడి ఉన్న నా స్వజనాన్ని (బంధువులను) చూసి నా మనస్సు కలత చెందుతోంది.”
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||
“నా కాళ్లు చేతులు వణికిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, నా శరీరం గడగడలాడుతోంది మరియు ఒళ్ళు గగుర్పొడుస్తోంది.”
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్ చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||
“నా చేతిలో నుండి గాండీవం జారిపోతోంది, చర్మం అంతా మంట పుడుతోంది. నేను ఇక నిలబడలేకపోతున్నాను, నా మనస్సు భ్రమకు లోనవుతోంది.”
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో'నుపశ్యామి హత్వా స్వజనమాహవే ||
“ఓ కేశవా! నాకు అంతా అశుభ సూచకాలే కనిపిస్తున్నాయి. యుద్ధంలో నా స్వజనాన్ని చంపి నేను పొందే శ్రేయస్సు ఏముంటుందో నాకు అర్థం కావడం లేదు.”
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ||
“కృష్ణా! నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు కూడా వద్దు. ఓ గోవిందా! అసలు మాకు రాజ్యంతో ఏం పని? ఈ భోగాలతో గానీ, కడకు ఈ ప్రాణాలతో గానీ మాకు కలిగే ప్రయోజనం ఏమిటి?”
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమే'వస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ||
“ఎవరి కోసం మనం ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను కోరుకుంటున్నామో, అట్టి మన గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు మరియు ఇతర బంధువులందరూ తమ ప్రాణాల మీద, ధనం మీద ఆశ వదులుకుని ఇక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు.”
ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతో'పి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||
“ఓ మధుసూదనా! వీరు నన్ను చంపినా సరే, నేను మాత్రం వీరిని చంపాలని కోరుకోవడం లేదు. మూడు లోకాల రాజ్యమే లభించినా సరే, ఈ భూమి కోసం నేను నా వారిని చంపుతానా? అది అసంభవం.”
నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ||
“ఓ జనార్దనా! ధృతరాష్ట్రుని కుమారులను చంపడం వల్ల మనకు కలిగే ఆనందం ఏమిటి? వీరు ఆతతాయులే (దుర్మార్గులే) అయినప్పటికీ, వీరిని చంపడం వల్ల మనకు పాపమే చుట్టుకుంటుంది.”
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||
“కాబట్టి మాధవా! మన బంధువులైన ధృతరాష్ట్రుని కుమారులను చంపడం మనకు తగదు. మన స్వజనాన్ని మనమే చంపుకుని ఎలా సుఖంగా ఉండగలం?”
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||
“రాజ్య కాంక్షతో, లోభంతో వీరి మనస్సులు పాడైపోయి ఉండవచ్చు. కులనాశనం వల్ల కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వల్ల కలిగే పాపాన్ని వీరు చూడలేకపోవచ్చు. కానీ జనార్దనా! కులనాశనం వల్ల కలిగే దోషాలు స్పష్టంగా తెలిసిన మనం, ఈ పాపం నుండి ఎందుకు తప్పుకోకూడదు?”
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో'భిభవత్యుత ||
“కులక్షయం సంభవించినప్పుడు సనాతనమైన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు ఆ కులమంతా అధర్మం పాలవుతుంది.”
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ||
“కృష్ణా! అధర్మం పెరిగిపోతే కులస్త్రీలు కలుషితమవుతారు. స్త్రీలు శీలహీనులైనప్పుడు వర్ణసంకరం (జాతి ధర్మాల కలయిక) జరుగుతుంది.”
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ||
“ఆ వర్ణసంకరం వల్ల కులాన్ని నాశనం చేసినవారు, ఆ కులము కూడా నరకానికి వెళ్తారు. పితృదేవతలకు పిండప్రదానాలు, తర్పణాలు అందకపోవడం వల్ల వారు కూడా అధోగతి పాలవుతారు.”
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||
“కులాన్ని నాశనం చేసేవారు చేసే ఈ వర్ణసంకర దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పూర్తిగా నశించిపోతాయి.”
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే'నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||
“ఓ జనార్దనా! కులధర్మాలను కోల్పోయిన మనుష్యులు శాశ్వతంగా నరకంలోనే నివసిస్తారని మనం పెద్దల ద్వారా విన్నాము.”
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ||
“అయ్యో! రాజ్య సుఖాల మీద ఉన్న ఆశతో మన స్వజనులను చంపడానికి సిద్ధపడి, మనం ఎంతటి ఘోర పాపానికి ఒడిగడుతున్నామో కదా!”
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||
“ఒకవేళ నేను ఎదురుతిరగకుండా, ఆయుధాలు ధరించకుండా ఊరకే ఉండిపోతే… చేతిలో ఆయుధాలు ఉన్న ధృతరాష్ట్రుని కుమారులు నన్ను ఈ యుద్ధంలో చంపేసినా సరే, అది నాకు క్షేమకరమే (మేలే) అవుతుంది.”
సంజయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||
సంజయుడు ఇలా అన్నాడు: “యుద్ధరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి, శోకంతో నిండిన మనస్సుతో తన ధనస్సును, బాణాలను పక్కన పడేసి రథం వెనుక భాగంలో కూలబడిపోయాడు.”
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అర్జునవిషాదయోగో నామ ప్రథమో'ధ్యాయః ||
ద్వితీయో'ధ్యాయః – సాంఖ్యయోగః
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ
तॆलुगु
स्तोत्रनिधि
श्रीमद्भगवद्गीत
गमनिक
: ई अध्यायमु (श्लोकालु मात्रमे) “
श्री कृष्ण स्तोत्रनिधि
” पारायण ग्रंथमुलो कूडा उन्नदि.
धृतराष्ट्र उवाच |
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पांडवाश्चैव किमकुर्वत संजय ||
धृतराष्ट्रुडु इला अन्नाडु: “ओ संजया! धर्मक्षेत्रमैन कुरुक्षेत्रंलो युद्धं चेयालने कोरिकतो समकूडिन ना कुमारुलु (कौरवुलु), पांडुपुत्रुलु (पांडवुलु) एं चेशारु?”
संजय उवाच |
दृष्ट्वा तु पांडवानीकं व्यूढं दुर्योधनस्तदा |
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ||
संजयुडु इला अन्नाडु: “राजा! व्यूहरचनतो उन्न पांडव सैन्यान्नि चूसिन दुर्योधनुडु, अप्पुडु तन गुरुवु द्रोणाचार्युनि दग्गरकु वॆळ्लि ई माटलु चॆप्पाडु.”
पश्यैतां पांडुपुत्राणामाचार्य महतीं चमूम् |
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ||
“आचार्या! मी बुद्धिमंतुडैन शिष्युडु, द्रुपद कुमारुडैन धृष्टद्युम्नुडि चेत व्यूहपरंगा निलपबडिन पांडुपुत्रुल ई गॊप्प सैन्यान्नि चूडंडि.”
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि |
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ||
“ई सैन्यंलो गॊप्प विलुकांड्रु, युद्धंलो भीमार्जुनुलतो समानमैन शूरुलु उन्नारु. वारु – युयुधानुडु (सात्यकि), विराटुडु मरियु महारथुडैन द्रुपदुडु.”
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् |
पुरुजित् कुंतिभोजश्च शैब्यश्च नरपुंगवः ||
“अलागे धृष्टकेतुवु, चेकितानुडु, बलवंतुडैन काशीराजु, पुरुजित्तु, कुंतिभोजुडु मरियु नरश्रेष्ठुडैन शैब्युडु कूडा उन्नारु.”
युधामन्युश्च विक्रांत उत्तमौजाश्च वीर्यवान् |
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ||
“पराक्रमवंतुडैन युधामन्युडु, बलशालियैन उत्तमौजुडु, सुभद्र कुमारुडु (अभिमन्युडु), द्रौपदि कुमारुलु (उपपांडवुलु) – वीरंदरू महारथुले.”
अस्माकं तु विशिष्टा ये तान् निबोध द्विजोत्तम |
नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते ||
“द्विजोत्तमा! मन पक्षंलो उन्न विशिष्टुलैन वारिनि कूडा तॆलुसुकोंडि. मी अवगाहन कोसं ना सैन्यंलोनि नायकुल पेर्लनु मीकु चॆबुतानु.”
भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः |
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ||
“मीरु (द्रोणुलु), भीष्मुडु, कर्णुडु, युद्धविजेतयैन कृपाचार्युडु, अश्वत्थाम, विकर्णुडु मरियु सोमदत्तुनि कुमारुडैन भूरिश्रवसुडु.”
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः |
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ||
“वीरे काक ना कोसं प्राणालनु वदुलुकोवडानिकि सिद्धपडिन वारु, रकरकाल आयुधालु धरिंचिन वारु, युद्धविद्यलो आरितेरिन शूरुलु इंका ऎंतोमंदि उन्नारु.”
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् |
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ||
“भीष्मुडि रक्षणलो उन्न मन सैन्यं अपारमैनदि (लेदा जयिंचलेनिदि), कानी भीमुडि रक्षणलो उन्न पांडव सैन्यं परिमितमैनदि (लेदा सुलभंगा जयिंचदगिनदि).”
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः |
भीष्ममेवाभिरक्षंतु भवंतः सर्व एव हि ||
“काबट्टि मीरंदरू मी मी स्थानाल्लो (व्यूहाललो) उंडि, अन्नि वैपुल नुंडि भीष्मुडिने कापाडालि.”
तस्य संजनयन् हर्षं कुरुवृद्धः पितामहः |
सिंहनादं विनद्योच्चैः शंखं दध्मौ प्रतापवान् ||
“अप्पुडु कौरव वृद्धुडु, प्रतापवंतुडैन पितामह भीष्मुडु दुर्योधनुडिकि संतोषं कलिगिंचडानिकि सिंहनादं चेस्तू, बिग्गरगा शंखान्नि पूरिंचाडु.”
ततः शंखाश्च भेर्यश्च पणवानकगोमुखाः |
सहसैवाभ्यहन्यंत स शब्दस्तुमुलोऽभवत् ||
“वॆंटने शंखालु, भेरीलु, तम्मटलु, नगारालु, कॊम्मुलु ऒकेसारि म्रोगायि. आ शब्दं चाला भयंकरंगा मिन्नंटिंदि.”
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यंदने स्थितौ |
माधवः पांडवश्चैव दिव्यौ शंखौ प्रदध्मतुः ||
“आ तर्वात तॆल्लनि गुर्रालु कट्टिन गॊप्प रथं मीद कूर्चुन्न श्रीकृष्णुडु (माधवुडु), अर्जुनुडु (पांडवुडु) तम दिव्यमैन शंखालनु पूरिंचारु.”
पांचजन्यं हृषीकेशो देवदत्तं धनंजयः |
पौंड्रं दध्मौ महाशंखं भीमकर्मा वृकोदरः ||
“श्रीकृष्णुडु ‘पांचजन्यं’ अने शंखान्नि, अर्जुनुडु ‘देवदत्तं’ अने शंखान्नि, भयंकरमैन पनुलु चेसे भीमसेनुडु ‘पौंड्रं’ अने महा शंखान्नि पूरिंचारु.”
अनंतविजयं राजा कुंतीपुत्रो युधिष्ठिरः |
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ||
कुंतीपुत्रुडैन धर्मराजु ‘अनंतविजयं’ अने शंखान्नि, नकुलुडु ‘सुघोषं’ अने शंखान्नि, सहदेवुडु ‘मणिपुष्पकं’ अने शंखान्नि पूरिंचारु.
काश्यश्च परमेष्वासः शिखंडी च महारथः |
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ||
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते |
सौभद्रश्च महाबाहुः शंखान् दध्मुः पृथक् पृथक् ||
ओ राजा! गॊप्प विलुकाडैन काशीराजु, महारथुडैन शिखंडि, धृष्टद्युम्नुडु, विराटुडु, अजेयुडैन सात्यकि, द्रुपदुडु, द्रौपदि कुमारुलु मरियु महाबाहुवु गल सुभद्रा पुत्रुडु (अभिमन्युडु) – वीरंदरू अन्नि वैपुल नुंडि तम तम शंखालनु विडिविडिगा पूरिंचारु.
स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् |
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ||
आ भयंकरमैन शंखध्वनि आकाशान्नि, भूमिनि प्रतिध्वनिंपजेस्तू, युद्धानिकि सिद्धमैन धृतराष्ट्रुनि कुमारुल (कौरवुल) गुंडॆलनु पगुलजेसिंदि.
अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः |
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पांडवः ||
हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते |
ओ राजा! आ समयंलो युद्धानिकि सिद्धंगा उन्न धृतराष्ट्रुनि कुमारुलनु चूसि, कपिध्वजुडैन अर्जुनुडु तन धनस्सुनु पैकॆत्ति, युद्धं प्रारंभं कावडानिकि मुंदे श्रीकृष्णुडितो (हृषीकेशुडितो) ई विधंगा अन्नाडु.
अर्जुन उवाच |
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ||
यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् |
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ||
अर्जुनुडु इला अन्नाडु: “ओ अच्युता! युद्धं चेयालने कोरिकतो इक्कड निलबडि उन्न वीरिनि नेनु चूसे वरकु, ई रणरंगंलो नेनु ऎवरॆवरितो युद्धं चेयालो तॆलुसुकुने वरकु, ना रथान्नि रॆंडु सैन्याल मध्य निलपंडि.”
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः |
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ||
“दुर्बुद्धि गल दुर्योधनुडिकि प्रियं चेयालने उद्देशंतो, इक्कड युद्धं चेयडानिकि वच्चिन वारिनि नेनु चूडालनुकुंटुन्नानु.”
संजय उवाच |
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत |
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ||
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् |
उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति ||
संजयुडु इला अन्नाडु: “ओ राजा! अर्जुनुडु (गुडाकेशुडु) चॆप्पिन माट विनि, श्रीकृष्णुडु आ उत्तममैन रथान्नि रॆंडु सैन्याल मध्य, भीष्म द्रोणुलु मरियु मिगिलिन राजुलंदरि मुंदु निलिपि, ‘पार्था! इक्कड समावेशमैन ई कुरुवंशीयुलनु चूडु’ अनि अन्नाडु.”
तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् |
आचार्यान्मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा ||
श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि |
तान् समीक्ष्य स कौंतेयः सर्वान् बंधूनवस्थितान् ||
अप्पुडु अर्जुनुडु अक्कड निलबडि उन्न तन तंड्रि समानुलनु (पिनतंड्रि, पॆदतंड्रुलनु), तातलनु, गुरुवुलनु, मेनमामलनु, सोदरुलनु, पुत्रुलनु, मनुमलनु, स्नेहितुलनु, मामलनु मरियु हितुलनु चूशाडु. रॆंडु सैन्याललो उन्न तन बंधुवुलंदरिनी चूसिन अर्जुनुडु (कुंतीपुत्रुडु) अत्यंत व्याकुलतकु लोनय्याडु.
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् |
अर्जुन उवाच |
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ||
मिक्किलि जालितो निंडिनवाडै, दुःखिस्तू अर्जुनुडु इला अन्नाडु: “कृष्णा! युद्धं चेयालने कोरिकतो इक्कड निलबडि उन्न ना स्वजनान्नि (बंधुवुलनु) चूसि ना मनस्सु कलत चॆंदुतोंदि.”
सीदंति मम गात्राणि मुखं च परिशुष्यति |
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ||
“ना काळ्लु चेतुलु वणिकिपोतुन्नायि, नोरु ऎंडिपोतोंदि, ना शरीरं गडगडलाडुतोंदि मरियु ऒळ्ळु गगुर्पॊडुस्तोंदि.”
गांडीवं स्रंसते हस्तात् त्वक् चैव परिदह्यते |
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ||
“ना चेतिलो नुंडि गांडीवं जारिपोतोंदि, चर्मं अंता मंट पुडुतोंदि. नेनु इक निलबडलेकपोतुन्नानु, ना मनस्सु भ्रमकु लोनवुतोंदि.”
निमित्तानि च पश्यामि विपरीतानि केशव |
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ||
“ओ केशवा! नाकु अंता अशुभ सूचकाले कनिपिस्तुन्नायि. युद्धंलो ना स्वजनान्नि चंपि नेनु पॊंदे श्रेयस्सु एमुंटुंदो नाकु अर्थं कावडं लेदु.”
न कांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च |
किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वा ||
“कृष्णा! नाकु विजयं वद्दु, राज्यं वद्दु, सुखालु कूडा वद्दु. ओ गोविंदा! असलु माकु राज्यंतो एं पनि? ई भोगालतो गानी, कडकु ई प्राणालतो गानी माकु कलिगे प्रयोजनं एमिटि?”
येषामर्थे कांक्षितं नो राज्यं भोगाः सुखानि च |
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ||
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः |
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबंधिनस्तथा ||
“ऎवरि कोसं मनं ई राज्यान्नि, भोगालनु, सुखालनु कोरुकुंटुन्नामो, अट्टि मन गुरुवुलु, तंड्रुलु, कुमारुलु, तातलु, मेनमामलु, मामलु, मनुमलु, बावमरुदुलु मरियु इतर बंधुवुलंदरू तम प्राणाल मीद, धनं मीद आश वदुलुकुनि इक्कड युद्ध रंगंलो निलबडि उन्नारु.”
एतान् न हंतुमिच्छामि घ्नतोऽपि मधुसूदन |
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ||
“ओ मधुसूदना! वीरु नन्नु चंपिना सरे, नेनु मात्रं वीरिनि चंपालनि कोरुकोवडं लेदु. मूडु लोकाल राज्यमे लभिंचिना सरे, ई भूमि कोसं नेनु ना वारिनि चंपुताना? अदि असंभवं.”
निहत्य धार्तराष्ट्रान् नः का प्रीतिः स्याज्जनार्दन |
पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः ||
“ओ जनार्दना! धृतराष्ट्रुनि कुमारुलनु चंपडं वल्ल मनकु कलिगे आनंदं एमिटि? वीरु आततायुले (दुर्मार्गुले) अयिनप्पटिकी, वीरिनि चंपडं वल्ल मनकु पापमे चुट्टुकुंटुंदि.”
तस्मान्नार्हा वयं हंतुं धार्तराष्ट्रान् स्वबांधवान् |
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ||
“काबट्टि माधवा! मन बंधुवुलैन धृतराष्ट्रुनि कुमारुलनु चंपडं मनकु तगदु. मन स्वजनान्नि मनमे चंपुकुनि ऎला सुखंगा उंडगलं?”
यद्यप्येते न पश्यंति लोभोपहतचेतसः |
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ||
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् |
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ||
“राज्य कांक्षतो, लोभंतो वीरि मनस्सुलु पाडैपोयि उंडवच्चु. कुलनाशनं वल्ल कलिगे दोषान्नि, मित्र द्रोहं वल्ल कलिगे पापान्नि वीरु चूडलेकपोवच्चु. कानी जनार्दना! कुलनाशनं वल्ल कलिगे दोषालु स्पष्टंगा तॆलिसिन मनं, ई पापं नुंडि ऎंदुकु तप्पुकोकूडदु?”
कुलक्षये प्रणश्यंति कुलधर्माः सनातनाः |
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ||
“कुलक्षयं संभविंचिनप्पुडु सनातनमैन कुलधर्मालु नशिस्तायि. धर्मं नशिंचिनप्पुडु आ कुलमंता अधर्मं पालवुतुंदि.”
अधर्माभिभवात् कृष्ण प्रदुष्यंति कुलस्त्रियः |
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः ||
“कृष्णा! अधर्मं पॆरिगिपोते कुलस्त्रीलु कलुषितमवुतारु. स्त्रीलु शीलहीनुलैनप्पुडु वर्णसंकरं (जाति धर्माल कलयिक) जरुगुतुंदि.”
संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च |
पतंति पितरो ह्येषां लुप्तपिंडोदकक्रियाः ||
“आ वर्णसंकरं वल्ल कुलान्नि नाशनं चेसिनवारु, आ कुलमु कूडा नरकानिकि वॆळ्तारु. पितृदेवतलकु पिंडप्रदानालु, तर्पणालु अंदकपोवडं वल्ल वारु कूडा अधोगति पालवुतारु.”
दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः |
उत्साद्यंते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ||
“कुलान्नि नाशनं चेसेवारु चेसे ई वर्णसंकर दोषाल वल्ल शाश्वतमैन जाति धर्मालु, कुलधर्मालु पूर्तिगा नशिंचिपोतायि.”
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन |
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ||
“ओ जनार्दना! कुलधर्मालनु कोल्पोयिन मनुष्युलु शाश्वतंगा नरकंलोने निवसिस्तारनि मनं पॆद्दल द्वारा विन्नामु.”
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् |
यद्राज्यसुखलोभेन हंतुं स्वजनमुद्यताः ||
“अय्यो! राज्य सुखाल मीद उन्न आशतो मन स्वजनुलनु चंपडानिकि सिद्धपडि, मनं ऎंतटि घोर पापानिकि ऒडिगडुतुन्नामो कदा!”
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः |
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ||
“ऒकवेळ नेनु ऎदुरुतिरगकुंडा, आयुधालु धरिंचकुंडा ऊरके उंडिपोते… चेतिलो आयुधालु उन्न धृतराष्ट्रुनि कुमारुलु नन्नु ई युद्धंलो चंपेसिना सरे, अदि नाकु क्षेमकरमे (मेले) अवुतुंदि.”
संजय उवाच |
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् |
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ||
संजयुडु इला अन्नाडु: “युद्धरंगंलो अर्जुनुडु ई विधंगा पलिकि, शोकंतो निंडिन मनस्सुतो तन धनस्सुनु, बाणालनु पक्कन पडेसि रथं वॆनुक भागंलो कूलबडिपोयाडु.”
इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ||
द्वितीयोऽध्यायः – सांख्ययोगः
गमनिक
: पैन इव्वबडिन अध्यायमु (श्लोकालु मात्रमे), ई पुस्तकमुलो कूडा उन्नदि.
श्री कृष्ण स्तोत्रनिधि
(नित्य पारायण ग्रंथमु)
संपूर्ण
श्रीमद्भगवद्गीत
चूडंडि.
मा प्रचुरण:
श्री बगळामुखी स्तोत्रनिधि (तात्पर्य सहितं)
प्रिंटिंगु पूर्ति अयि कॊनुगोलुकु सिद्धंगा उंदि.
स्तोत्रनिधि (तॆलुगु) वाट्साप् छानल् :
मा तॆलुगु वाट्साप् छानल् नि फालो चेयडानिकि
इक्कड क्लिक् चेयंडि
"तॆलुगु"
विप्रुलकु, द्विजुलकु विज्ञप्ति :
मंत्र अनुष्ठानं लेक नेटि कालंलो धर्माचरण क्षीणिस्तू उन्नदि. दयचेसि मीकु उपदेशं उन्न मंत्रं कनीसं लक्ष जपं चेयंडि. मीकु अतिदग्गरलो उन्न देवालयानिकि प्रतिरोजू वॆळ्ळि अक्कडि देवत मंत्रान्नि कनीसं 108 जपंचेसि, आ देवत बलान्नि वृद्धि चेयंडि. देवत अनुग्रहं उंटेने आ प्रांतंलो धर्मं वर्धिल्लुतुंदि.
तॆलुगु
tèlugu
śrīmadbhagavadgīta
gamanika
: ī adhyāyamu (ślokālu mātrame) “
” pārāyaṇa graṃthamulo kūḍā unnadi.
dhṛtarāṣṭra uvāca |
dharmakṣetre kurukṣetre samavetā yuyutsavaḥ |
māmakāḥ pāṃḍavāścaiva kimakurvata saṃjaya ||
dhṛtarāṣṭruḍu ilā annāḍu: “o saṃjayā! dharmakṣetramaina kurukṣetraṃlo yuddhaṃ ceyālane korikato samakūḍina nā kumārulu (kauravulu), pāṃḍuputrulu (pāṃḍavulu) eṃ ceśāru?”
saṃjaya uvāca |
dṛṣṭvā tu pāṃḍavānīkaṃ vyūḍhaṃ duryodhanastadā |
ācāryamupasaṃgamya rājā vacanamabravīt ||
saṃjayuḍu ilā annāḍu: “rājā! vyūharacanato unna pāṃḍava sainyānni cūsina duryodhanuḍu, appuḍu tana guruvu droṇācāryuni daggaraku vèḻli ī māṭalu cèppāḍu.”
paśyaitāṃ pāṃḍuputrāṇāmācārya mahatīṃ camūm |
vyūḍhāṃ drupadaputreṇa tava śiṣyeṇa dhīmatā ||
“ācāryā! mī buddhimaṃtuḍaina śiṣyuḍu, drupada kumāruḍaina dhṛṣṭadyumnuḍi ceta vyūhaparaṃgā nilapabaḍina pāṃḍuputrula ī gòppa sainyānni cūḍaṃḍi.”
atra śūrā maheṣvāsā bhīmārjunasamā yudhi |
yuyudhāno virāṭaśca drupadaśca mahārathaḥ ||
“ī sainyaṃlo gòppa vilukāṃḍru, yuddhaṃlo bhīmārjunulato samānamaina śūrulu unnāru. vāru – yuyudhānuḍu (sātyaki), virāṭuḍu mariyu mahārathuḍaina drupaduḍu.”
dhṛṣṭaketuścekitānaḥ kāśirājaśca vīryavān |
purujit kuṃtibhojaśca śaibyaśca narapuṃgavaḥ ||
“alāge dhṛṣṭaketuvu, cekitānuḍu, balavaṃtuḍaina kāśīrāju, purujittu, kuṃtibhojuḍu mariyu naraśreṣṭhuḍaina śaibyuḍu kūḍā unnāru.”
yudhāmanyuśca vikrāṃta uttamaujāśca vīryavān |
saubhadro draupadeyāśca sarva eva mahārathāḥ ||
“parākramavaṃtuḍaina yudhāmanyuḍu, balaśāliyaina uttamaujuḍu, subhadra kumāruḍu (abhimanyuḍu), draupadi kumārulu (upapāṃḍavulu) – vīraṃdarū mahārathule.”
asmākaṃ tu viśiṣṭā ye tān nibodha dvijottama |
nāyakā mama sainyasya saṃjñārthaṃ tān bravīmi te ||
“dvijottamā! mana pakṣaṃlo unna viśiṣṭulaina vārini kūḍā tèlusukoṃḍi. mī avagāhana kosaṃ nā sainyaṃloni nāyakula perlanu mīku cèbutānu.”
bhavān bhīṣmaśca karṇaśca kṛpaśca samitiṃjayaḥ |
aśvatthāmā vikarṇaśca saumadattistathaiva ca ||
“mīru (droṇulu), bhīṣmuḍu, karṇuḍu, yuddhavijetayaina kṛpācāryuḍu, aśvatthāma, vikarṇuḍu mariyu somadattuni kumāruḍaina bhūriśravasuḍu.”
anye ca bahavaḥ śūrā madarthe tyaktajīvitāḥ |
nānāśastrapraharaṇāḥ sarve yuddhaviśāradāḥ ||
“vīre kāka nā kosaṃ prāṇālanu vadulukovaḍāniki siddhapaḍina vāru, rakarakāla āyudhālu dhariṃcina vāru, yuddhavidyalo āriterina śūrulu iṃkā èṃtomaṃdi unnāru.”
aparyāptaṃ tadasmākaṃ balaṃ bhīṣmābhirakṣitam |
paryāptaṃ tvidameteṣāṃ balaṃ bhīmābhirakṣitam ||
“bhīṣmuḍi rakṣaṇalo unna mana sainyaṃ apāramainadi (ledā jayiṃcalenidi), kānī bhīmuḍi rakṣaṇalo unna pāṃḍava sainyaṃ parimitamainadi (ledā sulabhaṃgā jayiṃcadaginadi).”
ayaneṣu ca sarveṣu yathābhāgamavasthitāḥ |
bhīṣmamevābhirakṣaṃtu bhavaṃtaḥ sarva eva hi ||
“kābaṭṭi mīraṃdarū mī mī sthānāllo (vyūhālalo) uṃḍi, anni vaipula nuṃḍi bhīṣmuḍine kāpāḍāli.”
tasya saṃjanayan harṣaṃ kuruvṛddhaḥ pitāmahaḥ |
siṃhanādaṃ vinadyoccaiḥ śaṃkhaṃ dadhmau pratāpavān ||
“appuḍu kaurava vṛddhuḍu, pratāpavaṃtuḍaina pitāmaha bhīṣmuḍu duryodhanuḍiki saṃtoṣaṃ kaligiṃcaḍāniki siṃhanādaṃ cestū, biggaragā śaṃkhānni pūriṃcāḍu.”
tataḥ śaṃkhāśca bheryaśca paṇavānakagomukhāḥ |
sahasaivābhyahanyaṃta sa śabdastumulo'bhavat ||
“vèṃṭane śaṃkhālu, bherīlu, tammaṭalu, nagārālu, kòmmulu òkesāri mrogāyi. ā śabdaṃ cālā bhayaṃkaraṃgā minnaṃṭiṃdi.”
tataḥ śvetairhayairyukte mahati syaṃdane sthitau |
mādhavaḥ pāṃḍavaścaiva divyau śaṃkhau pradadhmatuḥ ||
“ā tarvāta tèllani gurrālu kaṭṭina gòppa rathaṃ mīda kūrcunna śrīkṛṣṇuḍu (mādhavuḍu), arjunuḍu (pāṃḍavuḍu) tama divyamaina śaṃkhālanu pūriṃcāru.”
pāṃcajanyaṃ hṛṣīkeśo devadattaṃ dhanaṃjayaḥ |
pauṃḍraṃ dadhmau mahāśaṃkhaṃ bhīmakarmā vṛkodaraḥ ||
“śrīkṛṣṇuḍu ‘pāṃcajanyaṃ’ ane śaṃkhānni, arjunuḍu ‘devadattaṃ’ ane śaṃkhānni, bhayaṃkaramaina panulu cese bhīmasenuḍu ‘pauṃḍraṃ’ ane mahā śaṃkhānni pūriṃcāru.”
anaṃtavijayaṃ rājā kuṃtīputro yudhiṣṭhiraḥ |
nakulaḥ sahadevaśca sughoṣamaṇipuṣpakau ||
kuṃtīputruḍaina dharmarāju ‘anaṃtavijayaṃ’ ane śaṃkhānni, nakuluḍu ‘sughoṣaṃ’ ane śaṃkhānni, sahadevuḍu ‘maṇipuṣpakaṃ’ ane śaṃkhānni pūriṃcāru.
kāśyaśca parameṣvāsaḥ śikhaṃḍī ca mahārathaḥ |
dhṛṣṭadyumno virāṭaśca sātyakiścāparājitaḥ ||
drupado draupadeyāśca sarvaśaḥ pṛthivīpate |
saubhadraśca mahābāhuḥ śaṃkhān dadhmuḥ pṛthak pṛthak ||
o rājā! gòppa vilukāḍaina kāśīrāju, mahārathuḍaina śikhaṃḍi, dhṛṣṭadyumnuḍu, virāṭuḍu, ajeyuḍaina sātyaki, drupaduḍu, draupadi kumārulu mariyu mahābāhuvu gala subhadrā putruḍu (abhimanyuḍu) – vīraṃdarū anni vaipula nuṃḍi tama tama śaṃkhālanu viḍiviḍigā pūriṃcāru.
sa ghoṣo dhārtarāṣṭrāṇāṃ hṛdayāni vyadārayat |
nabhaśca pṛthivīṃ caiva tumulo vyanunādayan ||
ā bhayaṃkaramaina śaṃkhadhvani ākāśānni, bhūmini pratidhvaniṃpajestū, yuddhāniki siddhamaina dhṛtarāṣṭruni kumārula (kauravula) guṃḍèlanu pagulajesiṃdi.
atha vyavasthitān dṛṣṭvā dhārtarāṣṭrān kapidhvajaḥ |
pravṛtte śastrasaṃpāte dhanurudyamya pāṃḍavaḥ ||
hṛṣīkeśaṃ tadā vākyamidamāha mahīpate |
o rājā! ā samayaṃlo yuddhāniki siddhaṃgā unna dhṛtarāṣṭruni kumārulanu cūsi, kapidhvajuḍaina arjunuḍu tana dhanassunu paikètti, yuddhaṃ prāraṃbhaṃ kāvaḍāniki muṃde śrīkṛṣṇuḍito (hṛṣīkeśuḍito) ī vidhaṃgā annāḍu.
arjuna uvāca |
senayorubhayormadhye rathaṃ sthāpaya me'cyuta ||
yāvadetān nirīkṣe'haṃ yoddhukāmānavasthitān |
kairmayā saha yoddhavyamasmin raṇasamudyame ||
arjunuḍu ilā annāḍu: “o acyutā! yuddhaṃ ceyālane korikato ikkaḍa nilabaḍi unna vīrini nenu cūse varaku, ī raṇaraṃgaṃlo nenu èvarèvarito yuddhaṃ ceyālo tèlusukune varaku, nā rathānni rèṃḍu sainyāla madhya nilapaṃḍi.”
yotsyamānānavekṣe'haṃ ya ete'tra samāgatāḥ |
dhārtarāṣṭrasya durbuddheryuddhe priyacikīrṣavaḥ ||
“durbuddhi gala duryodhanuḍiki priyaṃ ceyālane uddeśaṃto, ikkaḍa yuddhaṃ ceyaḍāniki vaccina vārini nenu cūḍālanukuṃṭunnānu.”
saṃjaya uvāca |
evamukto hṛṣīkeśo guḍākeśena bhārata |
senayorubhayormadhye sthāpayitvā rathottamam ||
bhīṣmadroṇapramukhataḥ sarveṣāṃ ca mahīkṣitām |
uvāca pārtha paśyaitān samavetān kurūniti ||
saṃjayuḍu ilā annāḍu: “o rājā! arjunuḍu (guḍākeśuḍu) cèppina māṭa vini, śrīkṛṣṇuḍu ā uttamamaina rathānni rèṃḍu sainyāla madhya, bhīṣma droṇulu mariyu migilina rājulaṃdari muṃdu nilipi, ‘pārthā! ikkaḍa samāveśamaina ī kuruvaṃśīyulanu cūḍu’ ani annāḍu.”
tatrāpaśyat sthitān pārthaḥ pitṝnatha pitāmahān |
ācāryānmātulān bhrātṝn putrān pautrān sakhīṃstathā ||
śvaśurān suhṛdaścaiva senayorubhayorapi |
tān samīkṣya sa kauṃteyaḥ sarvān baṃdhūnavasthitān ||
appuḍu arjunuḍu akkaḍa nilabaḍi unna tana taṃḍri samānulanu (pinataṃḍri, pèdataṃḍrulanu), tātalanu, guruvulanu, menamāmalanu, sodarulanu, putrulanu, manumalanu, snehitulanu, māmalanu mariyu hitulanu cūśāḍu. rèṃḍu sainyālalo unna tana baṃdhuvulaṃdarinī cūsina arjunuḍu (kuṃtīputruḍu) atyaṃta vyākulataku lonayyāḍu.
kṛpayā parayāviṣṭo viṣīdannidamabravīt |
arjuna uvāca |
dṛṣṭvemaṃ svajanaṃ kṛṣṇa yuyutsuṃ samupasthitam ||
mikkili jālito niṃḍinavāḍai, duḥkhistū arjunuḍu ilā annāḍu: “kṛṣṇā! yuddhaṃ ceyālane korikato ikkaḍa nilabaḍi unna nā svajanānni (baṃdhuvulanu) cūsi nā manassu kalata cèṃdutoṃdi.”
sīdaṃti mama gātrāṇi mukhaṃ ca pariśuṣyati |
vepathuśca śarīre me romaharṣaśca jāyate ||
“nā kāḻlu cetulu vaṇikipotunnāyi, noru èṃḍipotoṃdi, nā śarīraṃ gaḍagaḍalāḍutoṃdi mariyu òḻḻu gagurpòḍustoṃdi.”
gāṃḍīvaṃ sraṃsate hastāt tvak caiva paridahyate |
na ca śaknomyavasthātuṃ bhramatīva ca me manaḥ ||
“nā cetilo nuṃḍi gāṃḍīvaṃ jāripotoṃdi, carmaṃ aṃtā maṃṭa puḍutoṃdi. nenu ika nilabaḍalekapotunnānu, nā manassu bhramaku lonavutoṃdi.”
nimittāni ca paśyāmi viparītāni keśava |
na ca śreyo'nupaśyāmi hatvā svajanamāhave ||
“o keśavā! nāku aṃtā aśubha sūcakāle kanipistunnāyi. yuddhaṃlo nā svajanānni caṃpi nenu pòṃde śreyassu emuṃṭuṃdo nāku arthaṃ kāvaḍaṃ ledu.”
na kāṃkṣe vijayaṃ kṛṣṇa na ca rājyaṃ sukhāni ca |
kiṃ no rājyena goviṃda kiṃ bhogairjīvitena vā ||
“kṛṣṇā! nāku vijayaṃ vaddu, rājyaṃ vaddu, sukhālu kūḍā vaddu. o goviṃdā! asalu māku rājyaṃto eṃ pani? ī bhogālato gānī, kaḍaku ī prāṇālato gānī māku kalige prayojanaṃ emiṭi?”
yeṣāmarthe kāṃkṣitaṃ no rājyaṃ bhogāḥ sukhāni ca |
ta ime'vasthitā yuddhe prāṇāṃstyaktvā dhanāni ca ||
ācāryāḥ pitaraḥ putrāstathaiva ca pitāmahāḥ |
mātulāḥ śvaśurāḥ pautrāḥ śyālāḥ saṃbaṃdhinastathā ||
“èvari kosaṃ manaṃ ī rājyānni, bhogālanu, sukhālanu korukuṃṭunnāmo, aṭṭi mana guruvulu, taṃḍrulu, kumārulu, tātalu, menamāmalu, māmalu, manumalu, bāvamarudulu mariyu itara baṃdhuvulaṃdarū tama prāṇāla mīda, dhanaṃ mīda āśa vadulukuni ikkaḍa yuddha raṃgaṃlo nilabaḍi unnāru.”
etān na haṃtumicchāmi ghnato'pi madhusūdana |
api trailokyarājyasya hetoḥ kiṃ nu mahīkṛte ||
“o madhusūdanā! vīru nannu caṃpinā sare, nenu mātraṃ vīrini caṃpālani korukovaḍaṃ ledu. mūḍu lokāla rājyame labhiṃcinā sare, ī bhūmi kosaṃ nenu nā vārini caṃputānā? adi asaṃbhavaṃ.”
nihatya dhārtarāṣṭrān naḥ kā prītiḥ syājjanārdana |
pāpamevāśrayedasmān hatvaitānātatāyinaḥ ||
“o janārdanā! dhṛtarāṣṭruni kumārulanu caṃpaḍaṃ valla manaku kalige ānaṃdaṃ emiṭi? vīru ātatāyule (durmārgule) ayinappaṭikī, vīrini caṃpaḍaṃ valla manaku pāpame cuṭṭukuṃṭuṃdi.”
tasmānnārhā vayaṃ haṃtuṃ dhārtarāṣṭrān svabāṃdhavān |
svajanaṃ hi kathaṃ hatvā sukhinaḥ syāma mādhava ||
“kābaṭṭi mādhavā! mana baṃdhuvulaina dhṛtarāṣṭruni kumārulanu caṃpaḍaṃ manaku tagadu. mana svajanānni maname caṃpukuni èlā sukhaṃgā uṃḍagalaṃ?”
yadyapyete na paśyaṃti lobhopahatacetasaḥ |
kulakṣayakṛtaṃ doṣaṃ mitradrohe ca pātakam ||
kathaṃ na jñeyamasmābhiḥ pāpādasmānnivartitum |
kulakṣayakṛtaṃ doṣaṃ prapaśyadbhirjanārdana ||
“rājya kāṃkṣato, lobhaṃto vīri manassulu pāḍaipoyi uṃḍavaccu. kulanāśanaṃ valla kalige doṣānni, mitra drohaṃ valla kalige pāpānni vīru cūḍalekapovaccu. kānī janārdanā! kulanāśanaṃ valla kalige doṣālu spaṣṭaṃgā tèlisina manaṃ, ī pāpaṃ nuṃḍi èṃduku tappukokūḍadu?”
kulakṣaye praṇaśyaṃti kuladharmāḥ sanātanāḥ |
dharme naṣṭe kulaṃ kṛtsnamadharmo'bhibhavatyuta ||
“kulakṣayaṃ saṃbhaviṃcinappuḍu sanātanamaina kuladharmālu naśistāyi. dharmaṃ naśiṃcinappuḍu ā kulamaṃtā adharmaṃ pālavutuṃdi.”
adharmābhibhavāt kṛṣṇa praduṣyaṃti kulastriyaḥ |
strīṣu duṣṭāsu vārṣṇeya jāyate varṇasaṃkaraḥ ||
“kṛṣṇā! adharmaṃ pèrigipote kulastrīlu kaluṣitamavutāru. strīlu śīlahīnulainappuḍu varṇasaṃkaraṃ (jāti dharmāla kalayika) jarugutuṃdi.”
saṃkaro narakāyaiva kulaghnānāṃ kulasya ca |
pataṃti pitaro hyeṣāṃ luptapiṃḍodakakriyāḥ ||
“ā varṇasaṃkaraṃ valla kulānni nāśanaṃ cesinavāru, ā kulamu kūḍā narakāniki vèḻtāru. pitṛdevatalaku piṃḍapradānālu, tarpaṇālu aṃdakapovaḍaṃ valla vāru kūḍā adhogati pālavutāru.”
doṣairetaiḥ kulaghnānāṃ varṇasaṃkarakārakaiḥ |
utsādyaṃte jātidharmāḥ kuladharmāśca śāśvatāḥ ||
“kulānni nāśanaṃ cesevāru cese ī varṇasaṃkara doṣāla valla śāśvatamaina jāti dharmālu, kuladharmālu pūrtigā naśiṃcipotāyi.”
utsannakuladharmāṇāṃ manuṣyāṇāṃ janārdana |
narake'niyataṃ vāso bhavatītyanuśuśruma ||
“o janārdanā! kuladharmālanu kolpoyina manuṣyulu śāśvataṃgā narakaṃlone nivasistārani manaṃ pèddala dvārā vinnāmu.”
aho bata mahatpāpaṃ kartuṃ vyavasitā vayam |
yadrājyasukhalobhena haṃtuṃ svajanamudyatāḥ ||
“ayyo! rājya sukhāla mīda unna āśato mana svajanulanu caṃpaḍāniki siddhapaḍi, manaṃ èṃtaṭi ghora pāpāniki òḍigaḍutunnāmo kadā!”
yadi māmapratīkāramaśastraṃ śastrapāṇayaḥ |
dhārtarāṣṭrā raṇe hanyustanme kṣemataraṃ bhavet ||
“òkaveḻa nenu èdurutiragakuṃḍā, āyudhālu dhariṃcakuṃḍā ūrake uṃḍipote… cetilo āyudhālu unna dhṛtarāṣṭruni kumārulu nannu ī yuddhaṃlo caṃpesinā sare, adi nāku kṣemakarame (mele) avutuṃdi.”
saṃjaya uvāca |
evamuktvārjunaḥ saṃkhye rathopastha upāviśat |
visṛjya saśaraṃ cāpaṃ śokasaṃvignamānasaḥ ||
saṃjayuḍu ilā annāḍu: “yuddharaṃgaṃlo arjunuḍu ī vidhaṃgā paliki, śokaṃto niṃḍina manassuto tana dhanassunu, bāṇālanu pakkana paḍesi rathaṃ vènuka bhāgaṃlo kūlabaḍipoyāḍu.”
iti śrīmadbhagavadgītāsūpaniṣatsu brahmavidyāyāṃ yogaśāstre śrīkṛṣṇārjunasaṃvāde arjunaviṣādayogo nāma prathamo'dhyāyaḥ ||
dvitīyo'dhyāyaḥ – sāṃkhyayogaḥ
gamanika
: paina ivvabaḍina adhyāyamu (ślokālu mātrame), ī pustakamulo kūḍā unnadi.
(nitya pārāyaṇa graṃthamu)
saṃpūrṇa
śrīmadbhagavadgīta
cūḍaṃḍi.
mā pracuraṇa:
priṃṭiṃgu pūrti ayi kònugoluku siddhaṃgā uṃdi.
mā tèlugu vāṭsāp chānal ni phālo ceyaḍāniki
ikkaḍa klik ceyaṃḍi
"tèlugu"
viprulaku, dvijulaku vijñapti :
maṃtra anuṣṭhānaṃ leka neṭi kālaṃlo dharmācaraṇa kṣīṇistū unnadi. dayacesi mīku upadeśaṃ unna maṃtraṃ kanīsaṃ lakṣa japaṃ ceyaṃḍi. mīku atidaggaralo unna devālayāniki pratirojū vèḻḻi akkaḍi devata maṃtrānni kanīsaṃ 108 japaṃcesi, ā devata balānni vṛddhi ceyaṃḍi. devata anugrahaṃ uṃṭene ā prāṃtaṃlo dharmaṃ vardhillutuṃdi.
tèlugu
🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)
🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)
Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).
🧘 ఆసనము & నియమములు (Posture & Focus)
Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.
Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.