Nitya pooja vidhanam
Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Recitation & Chanting Guidelines
⏰ Best Chanting Time
Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or Sandhya Kaala
🗓️ Auspicious Timing
Daily Morning / Evening Sandhya
🔢 Recommended Count
1, 11, or 21 Times
✨ Key Spiritual Benefits
Inner Peace, Spiritual Protection, Divine Grace & Prosperity
📖 Complete Sarga Directory (31 Sargas)
Select any Sarga below to read the complete Sanskrit and Telugu shlokas:
Sarga 7
అభిషేకానికి పంచామృతాలు
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షంలో కలశంలో ఉన్న నీరు చాలు)
Chant Sarga ➔Sarga 1
శుచిః
పంచపాత్రలో నీళ్ళు ఉద్ధరిణతో కుడిచేతిలో పోసుకుని తలమీద జల్లుకోవాలి.
Chant Sarga ➔Sarga 2
ప్రార్థన
ఇక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిని చెప్తూ చేతులు జోడించాలి.
Chant Sarga ➔Sarga 3
ఆచమ్య
అంటే ఆచమనం. కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టి, మొదటి మూడు నామాలకు ఎడమ చేతితో పంచపాత్రలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని శబ్దం రాకుండా త్రాగాలి. నాలుగవ నామానికి నీళ్ళు విడిచిపెట్టి, తర్వాతి నామాలకు నమస్కారం చేయాలి. సాంప్రదాయాన్ని బట్టి మిగిలిన నామాలకు శరీర అంగములను స్పృశించవచ్చు.
Chant Sarga ➔Sarga 4
దీపారాధనం
దేవతా మూర్తికి రెండు వైపులా చెరియొక దీపం వెలిగిస్తూ ఈ శ్లోకం చెప్పాలి. మూడవ దీపం ఉపచార పూజలో వేరే శ్లోకం చెప్పి వెలిగించాలి. దీపానికి గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు, కొన్ని అక్షతలు వేయాలి.
Chant Sarga ➔Sarga 5
భూతోచ్ఛాటనం
ఈ శ్లోకం చెప్పి అక్షతలు ముక్కు దగ్గర పెట్టుకుని కళ్ళుమూసుకుని వాసన చూసి ఎడమ భుజం ప్రక్కగా వెనక్కి వేయాలి.
Chant Sarga ➔Sarga 6
ప్రాణాయామం
ఈ శ్లోకం చదివి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం కనీసంగా మూడుసార్లు చేయాలి. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. ఇవి నాలుగు సెకండ్ల చప్పున చేయాలి.
Chant Sarga ➔Sarga 6
1. పూరకం
కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కుపుటం మూసి, ఎడమ ముక్కుపుటం ద్వారా శ్వాస తీసుకోవాలి.
Chant Sarga ➔Sarga 6
2. కుంభకం
కుడి ఉంగరం, చిటికిన వేళ్ళతో ఎడమ ముక్కుపుటం మూసి, బొటన వేలితో కుడి ముక్కుపుటం మూసి, శ్వాసని ఆపాలి.
Chant Sarga ➔Sarga 6
3. రేచకం
కుడి ఉంగరం, చిటికిన వేళ్ళతో ఎడమ ముక్కుపుటం మూసి, కుడి ముక్కుపుటం తెరిచి దాని ద్వారా శ్వాసని వదలాలి.
Chant Sarga ➔Sarga 7
సంకల్పం
అక్షతలు కుడి చేతిలో తీసుకుని సంకల్పం చదువుకోవాలి. పంచాంగం దొరకని పక్షం లో దేశకాల సంకీర్తనం లో “శుభ” అని చెప్పుకోవచ్చు. చివరిలో “కరిష్యే” అన్నప్పుడు ఎడమ చేతితో ఉద్ధరిణతో పంచపాత్రలో నీళ్ళు తీసుకుని కుడి చేతి వేళ్ళమీదుగా అక్షతలు జారిపడేడట్టు అరివేణం లో విడిచిపెట్టాలి.
Chant Sarga ➔Sarga 8
కలశారాధనం
కలశానికి పెట్టిన చెంబుకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టాలి. ఒకటిగానీ, మూడుగానీ, అయిదు గానీ బొట్లు పెట్టవచ్చు. తర్వాత కలశం నీళ్ళలో గంధం, అక్షతలు వేసి ఒక పువ్వు వేయాలి. మామిడి ఆకులు ఉంటే అవి ౩ కానీ ౫ కానీ తీసుకుని, తొళ్ళిక నీటిలో, కొస ఆకాశానికి ఉండేలా వేయాలి. వేసిన పువ్వునిగానీ మామిడాకులను కానీ కుడి చేతివేళ్ళతో పట్టుకుని కలశాన్ని స్పృశిస్తూ శ్లోకం చెప్పాలి. “ఆపోవా ఇదగం” అన్నప్పుడు కలశంలో నీళ్ళను కుడిచేతి ఉంగరం వేలితో స్పృశించాలి. “సంప్రోక్ష్య” అన్నప్పుడు నీళ్ళను పూజా సామాగ్రి మీద, దేవతా ప్రతిమ మీద, మీ తలమీద జల్లుకోవాలి.
Chant Sarga ➔Sarga 9
శంఖపూజ
శంఖం అందుబాటులో ఉంటేనే ఇది చేయండి. ప్రత్యేకంగా అభిషేకం చేయాలనుకుంటే శంఖం ముందుగా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోండి. కలశంలోని నీళ్ళను కొంచెం శంఖంలోకి తీసుకుని, శంఖానికి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి, శంఖం నీటిలో గంధం మరియు అక్షతలు వేసి, శంఖం మీద ఒక పువ్వు పెట్టి ఈ శ్లోకం చదవాలి. తర్వాత ఆ నీళ్ళను తిరిగి కలశంలో పోసి, శంఖాన్ని దేవతా ప్రతిమ వద్ద ఉంచండి.
Chant Sarga ➔Sarga 10
ఘంటపూజ
ఘంటకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి ఒక పుష్పం, అక్షతలు వేసి ఈ శ్లోకం చదవాలి.
Chant Sarga ➔Sarga 11
ఘంటానాదం
ఘంటకి నమస్కారం చేసి కుడిచేతిలో తీసుకుని ఈ శ్లోకం చదువుతూ వాయించాలి.
Chant Sarga ➔Sarga 1
ధ్యానం
దేవతా స్వరూపాన్ని పూర్ణంగా ఊహచేసి, కుడి చేతిలో అక్షతలు పట్టుకుని మీరు పూజ చేయాలనుకున్న దేవాతా స్వరూపాన్ని వర్ణించే ధ్యానశ్లోకాలు చెప్పుకోవాలి. తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 2
ఆవాహనం
ధ్యానంలో గోచరమైన స్వరూపాన్ని మన కళ్ళకు ఎదురుగా ఉన్న ప్రతిమలోకి వచ్చినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 3
ఆసనం
ఆవాహన చేసిన దేవతా స్వరూపానికి మన ఎదురుగా ఒక స్థానంలో కూర్చుని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి, మన ఎదురుగా దాన్ని వేసినట్టు, దేవతా స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఊహించాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 4
పాద్యం
సింహాసనం లో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ళ క్రింద పెద్ద పళ్ళెం పెట్టి గంగాది సర్వతీర్థాలలోంచి మంచి నీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాలమీద పోసినట్టు, తర్వాత ఆ నీళ్ళు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని నీళ్ళు దేవతా మూర్తి పాదాల మీద జల్లాలి.
Chant Sarga ➔Sarga 5
అర్ఘ్యం
మన ఎదురుగా ఉన్న దేవతా స్వరూపానికి మన దోసిట నిండా నీళ్ళు తీసుకుని, ఆ దేవతా స్వరూపం యొక్క చేతులలో పోసినట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని కొద్ది నీరు తీసుకుని అరివేణంలో విడవాలి.
Chant Sarga ➔Sarga 6
ఆచమనీయం
పూజ పూర్వాంగం లో మనం ఆచమనం చేసినట్టు, దేవతా స్వరూపం కూడా ఆచమనం చేస్తున్నట్టు భావన చేయాలి. కుడి చేతితో కలశం లో నీళ్ళు ఉద్దరిణతో తీసుకుని, దేవతా స్వరూపం నోటికి అందించినట్టు భావన చేసి, అరివేణంలో మూడుసార్లు విడవాలి.
Chant Sarga ➔Sarga 7
అభిషేకం (స్నానం)
అభిషేకం లో మూడుభాగాలు – పంచామృత అభిషేకం, ఫలోదక అభిషేకం, శుద్ధోదక అభిషేకం. పంచామృత అభిషేకానికి ఐదు పదార్థాలు కావాలి – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర. ఇవి కలిపికానీ విడివిడిగా కానీ అభిషేకం చేయవచ్చు. ఫలోదకం కోసం కొబ్బరినీళ్ళు కానీ పళ్ళరసాలు గానీ వాడవచ్చు. శుద్ధోదకం కోసం కలశం నీళ్ళు వాడాలి. దేవతా మూర్తిని ఒక పెద్ద పళ్ళెం లో పెట్టి, ఉన్న పదార్థాలతో అభిషేకం చేయాలి. పంచామృత స్నానం, ఫలోదక స్నానం సాధ్యం కాకపోతే కలశంలోని నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. విడిగా అభిషేకం చేయడం కుదరకపోతే, కలశంలోని నీళ్ళను అందులో ఉన్న పువ్వుతోగానీ మామిడాకులతో గానీ తీసుకుని దేవతా మూర్తి మీద చిలకరించవచ్చు. బ్రహ్మాండం మొత్తం వ్యాప్తమైన దేవతస్వరూపానికి అభిషేకం చేస్తున్నట్టు భావన చేయాలి.
Chant Sarga ➔Sarga 8
వస్త్ర యుగ్మం
సింహాసనం లో ఉన్న దేవతకి దివ్య వస్త్రాలు సమర్పించినట్టు భావన చేయాలి. పురుష స్వరూపానికి శ్రేష్ఠమైన పంచె, కండువ ఇచ్చినట్టు, స్త్రీ స్వరూపానికి నాణ్యమైన చీర, రవిక ఇచ్చినట్టు భావన చేయాలి. ఇక్కడ శ్లోకం చెప్పాలి. కుదిరితే నిజమైన వస్త్రాలు, లేకపోతే ప్రత్తితో చేసిన వస్త్రాలు, లేకపోతే అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి. ఇచ్చిన వస్త్రాలను ఆ దేవతా స్వరూపం వేసుకున్నట్టు భావన చేయాలి. భావన మాత్రం ఉన్నతంగా ఉండాలి.
Chant Sarga ➔Sarga 9
ఆభరణం
మంచి బంగారు ఆభరణాలతో దేవతను అలంకరించినట్టు భావన చేయాలి. కుదిరితే ఆభరణం చూపాలి, లేదా కుడి చేతితో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, దేవత మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 10
గంధం
దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్ళకు, కంఠానికి గంధం రాసినట్టు భావన చేయాలి. కుడి చేతితో ఒక పువ్వు తీసుకుని, దానిని గంధంలో ముంచి, శ్లోకం చదివి, దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 11
పుష్పం
మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్టు, దోసిట నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్టు భావన చేయాలి. అంగ పూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తున్నట్టు భావన చేయాలి. అష్టోత్తరనామావళి గానీ సహస్రనామావళి గానీ చదువుకోవచ్చు. నోటితో నామాలు చెప్తూ కుడి చేతితో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి.
Chant Sarga ➔Sarga 12
ధూపం
శ్లోకం చెప్పి అగరవత్తులు, లేక సాంబ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి, పక్కన పెట్టాలి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి.
Chant Sarga ➔Sarga 13
దీపం
వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. మూడవ దీపం పెట్టడానికి కుదిరితే పెట్టాలి లేకపోతే మొదట వెలిగించిన దీపాలనే చూపాలి. కుడి చేతితో అక్షతలు దీపానికి చూపి అవి దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 14
నైవేద్యం
నివేదన కోసం తెచ్చిన పదార్థాలను ఒక పళ్ళెం లో పెట్టి, శ్లోకం చెప్తూ కలశం లోని నీళ్ళను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను కానీ కుడి చేతితో పట్టుకుని, గాయత్రీ మంత్రం చదివిన తరువాత నైవేద్యం చుట్టూ తిప్పి “స్వాహా” అన్నప్పుడు దేవతా మూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్లు భావన చేయాలి.
Chant Sarga ➔Sarga 15
తాంబూలం
నివేదన అయ్యక తమలపాకును చుట్టి దేవత స్వరూపనికి ఇచ్చినట్టు, అది ఆ దేవత నోటిలో పెట్టుకుని నమిలినట్టు భావన చేయాలి. శ్లోకం చెప్పి, కుడి చేతితో తాంబూలం ఆకులు, వక్కలు తీసుకుని దేవతా మూర్తికి ఒక ప్రక్కగా ఉంచాలి. తాంబూలం లభ్యం కాని పక్షంలో అక్షతలు తీసుకుని శ్లోకం చదివి, ఆ దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
Chant Sarga ➔Sarga 16
నీరాజనం
లేచి నిలబడి, హారతి వెలిగించి, ఘంట వాయిస్తూ, దేవతా స్వరూపానికి పాదాల నుంచి మూర్తికి కుడి చేతి వైపుగా మూడుమార్లు తిప్పాలి. హారతి తిప్పుతున్నప్పుడు ఆ దీప కాంతిలో మీరు అలంకరించిన దేవతా మూర్తిని పరిశీలించి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత హారతిపళ్ళెం పక్కన పెట్టి, దానికి ఒక ప్రక్క కలశంలోని నీళ్ళను చిలకరించి, హారతిని కళ్ళకు అద్దుకుని, కలశంలో నీళ్ళు ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి.
Chant Sarga ➔పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ
నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.
శుభ ముహూర్తం
బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.
జప సంఖ్యా నియమం
నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)
Nitya pooja vidhanam represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace):
Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being):
Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment):
Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.
🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)
🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)
Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).
🧘 ఆసనము & నియమములు (Posture & Focus)
Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.
Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.