Sri Bala Mantragarbha Ashtakam

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
🪔

Recitation & Chanting Guidelines

⏰ Best Chanting Time Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or Sandhya Kaala
🗓️ Auspicious Timing Daily Morning / Evening Sandhya
🔢 Recommended Count 1, 11, or 21 Times
✨ Key Spiritual Benefits Inner Peace, Spiritual Protection, Divine Grace & Prosperity
VERSE #1
(కులచూడామణి తంత్రములోని ఈ శ్రీ బాలా మంత్రగర్భాష్టకము అత్యంత విశేషమైనది. ఈ స్తోత్రంలోని అద్భుతం ఏమిటంటే, దీనిలోని శ్లోకాల మొదటి అక్షరాలను కలిపితే “ఐం వా ల య న మః స్వ హా” (ఐం బాలాయై నమః స్వాహా) అనే మంత్రం ఆవిర్భవిస్తుంది. అందుకే దీనిని ‘మంత్రగర్భ’ అష్టకము అంటారు. ఫలశ్రుతి ప్రకారం, దీనిని భక్తితో పఠించేవారు పరమగతిని (మోక్షాన్ని) పొందుతారు. ఇది వాక్ సిద్ధిని, సంపదను మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.)
ఐం‍కారరూపిణీం సత్యాం ఐం‍కారాక్షరమాలినీమ్ |
ఐం‍బీజరూపిణీం దేవీం బాలాదేవీం నమామ్యహమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
‘ఐం’ కారమే రూపముగా కలదానిని, సత్య స్వరూపిణిని, ‘ఐం’ కారములే మాలగా ధరించిన దానిని, ‘ఐం’ అనే బీజము నందు నివసించే బాలా దేవికి నేను నమస్కరిస్తున్నాను.
VERSE #2
వాగ్భవాం వారుణీపీతాం వాచాసిద్ధిప్రదాం శివామ్ |
బలిప్రియాం వరాలాఢ్యాం వందే బాలాం శుభప్రదామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
వాగ్భవ స్వరూపిణిని, వారుణీ (పశ్చిమ లేదా జ్ఞాన) పీఠమున వెలిగే దానిని, వాక్కుల యందు సిద్ధిని ఇచ్చే శివ స్వరూపిణిని, పూజల యందు ప్రీతి కలదానిని, వరములను ఇచ్చే శుభప్రదాతను నేను వందనం చేస్తున్నాను.
( శ్లోకంలో ‘వా’ మంత్రంలో  ‘బా’ గా మారుతుంది)
VERSE #3
లాక్షారసనిభాం త్ర్యక్షాం లలజ్జిహ్వాం భవప్రియామ్ |
లంబకేశీం లోకధాత్రీం బాలాం ద్రవ్యప్రదాం భజే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఎర్రని పారాని (లాక్షారసము) వంటి వర్ణము కలదానిని, మూడు కన్నుల దానిని, చలించే నాలుకతో భయంకర శత్రు సంహారిణిగా ఉన్న దానిని, లోకములను రక్షించే దానిని మరియు సకల సంపదలను (ద్రవ్యాలను) ఇచ్చే బాలా దేవిని భజిస్తున్నాను.
VERSE #4
యైకారస్థాం యజ్ఞరూపాం యూం రూపాం మంత్రరూపిణీమ్ |
యుధిష్ఠిరాం మహాబాలాం నమామి పరమార్థదామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
‘య’ కారము నందు స్థిరముగా ఉన్న దానిని, యజ్ఞములే రూపముగా కలదానిని, మంత్ర స్వరూపిణిని, యుద్ధమునందు స్థిరముగా ఉండే మహాబలవంతురాలిని, మోక్షమును (పరమార్థాన్ని) ఇచ్చే దేవికి నమస్కరిస్తున్నాను.
VERSE #5
నమస్తే'స్తు మహాబాలాం నమస్తే శంకరప్రియామ్ |
నమస్తే'స్తు గుణాతీతాం నమస్తే'స్తు నమో నమః ||
📖తాత్పర్యం / Meaning & Significance
గొప్ప బలము కలిగిన దేవికి నమస్కారము. శంకరునికి అత్యంత ప్రియమైన దేవికి నమస్కారము. త్రిగుణములకు అతీతమైన దేవికి మాటిమాటికీ నమస్కారములు.
VERSE #6
మహామనీం మంత్రరూపాం మోక్షదాం ముక్తకేశినీమ్ |
మాంసాంశీ చంద్రమౌలిం చ స్మరామి సతతం శివామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మహామంత్రమే రూపముగా కలిగిన మోక్షదాతను, ముక్తకేశిని (విరబోసిన జుట్టు కలదానిని), చంద్రుని తలపై ధరించిన మంగళకారిణిని స్మరిస్తున్నాను.
VERSE #7
స్వయంభువాం స్వధర్మస్థాం స్వాత్మబోధప్రకాశికామ్ |
స్వర్ణాభరణదీప్తాంగం బాలాం జ్ఞానప్రదాం భజే ||
📖తాత్పర్యం / Meaning & Significance
తనకు తానుగా ఉద్భవించిన దానిని, స్వధర్మము నందు నిలిచే దానిని, తనను తాను తెలుసుకునే జ్ఞానాన్ని (స్వాత్మబోధ) ప్రకాశింపజేసే దానిని, బంగారు ఆభరణములతో మెరిసే బాలా దేవిని భజిస్తున్నాను.
VERSE #8
హా హా హా శబ్దనిరతాం హాస్యాం హాస్యప్రియాం విభుమ్ |
హుంకారాద్దైత్యఖండాఖ్యాం శ్రీబాలాం ప్రణమామ్యహమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
‘హా హా హా’ అనే నాదమునందు ఆనందించే దానిని, చిరునవ్వు (హాస్యము) కలదానిని, తన ‘హుంకారము’ ద్వారా దైత్యులను (రాక్షసులను) ఖండించే శ్రీ బాలా దేవికి ప్రణమిల్లుతున్నాను.
VERSE #9
ఇత్యష్టకం మహాపుణ్యం బాలాయాః సిద్ధిదాయకమ్ |
యే పఠంతి సదా భక్త్యా గచ్ఛంతి పరమాం గతిమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
పైన చెప్పబడిన ఈ ఎనిమిది శ్లోకాల సమూహం (అష్టకం) అత్యంత పుణ్యప్రదమైనది. ఇది శ్రీ బాలా దేవి యొక్క అనుగ్రహాన్ని, మంత్ర సిద్ధిని ప్రసాదిస్తుంది. ఎవరైతే ఎల్లప్పుడూ (నిత్యం) భక్తిశ్రద్ధలతో దీనిని పఠిస్తారో, వారు పరమగతిని, అంటే జన్మరాహిత్యమైన మోక్ష స్థితిని లేదా దేవి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు.
VERSE #10
ఇతి కులచూడామణితంత్రే శ్రీబాలామంత్రగర్భాష్టకమ్ |
: పైన ఇవ్వబడిన స్తోత్రము
, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
(నిత్య పారాయణ గ్రంథము)
దేవీ స్తోత్రాలు
🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Sri Bala Mantragarbha Ashtakam represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.