📖 Multiple / General Texts

Sri Matangini Kavacham (Trailokya Mangala Kavacham)

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
📜

Sacred Scripture Study & Svadhyaya

Multiple / General Texts — Authentic Recitation with Sanskrit Verses & Classical Commentary
VERSE #1
దశమహావిద్యలు
శ్రీదేవ్యువాచ |
సాధు సాధు మహాదేవ కథయస్వ సురేశ్వర |
మాతంగీకవచం దివ్యం సర్వసిద్ధికరం నృణామ్ ||
VERSE #2
శ్రీదేవి ఇట్లనెను – ఓ మహాదేవా! సురేశ్వరా! బాగు బాగు, మనుష్యులకు సర్వసిద్ధులను కలిగించే దివ్యమైన మాతంగీకవచమును చెప్పుము.
🪷

శ్రీ ఈశ్వర ఉవాచ |

VERSE #3
శృణు దేవి ప్రవక్ష్యామి మాతంగీకవచం శుభమ్ |
గోపనీయం మహాదేవి మౌనీ జాపం సమాచరేత్ ||
VERSE #4
శ్రీ ఈశ్వరుడు పలికెను – ఓ దేవీ! శుభకరమైన మాతంగీకవచమును వినుము, చెప్పెదను. ఓ మహాదేవీ! ఇది రహస్యముగా కాపాడదగినది; మౌనముగా దీనిని జపించవలెను.
అస్య శ్రీమాతంగీకవచస్య దక్షిణామూర్తిరృషిః విరాట్ ఛందః మాతంగీ దేవతా చతుర్వర్గసిద్ధ్యర్థే వినియోగః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ శ్రీమాతంగీకవచమునకు దక్షిణామూర్తి ఋషి, విరాట్ ఛందస్సు, మాతంగీదేవత, ధర్మార్థకామమోక్షములనెడి చతుర్వర్గసిద్ధి కొరకు వినియోగము చెప్పబడినది.
VERSE #5
ఓం | శిరో మాతంగినీ పాతు భువనేశీ తు చక్షుషీ |
తోడలా కర్ణయుగళం త్రిపురా వదనం మమ ||
VERSE #6
ఓం – మాతంగినీదేవి నా శిరస్సును రక్షించుగాక; భువనేశీదేవి నా నేత్రములను రక్షించుగాక; తోడలాదేవి (కర్ణాభరణ రూపిణి) నా రెండు చెవులను రక్షించుగాక; త్రిపురాదేవి నా ముఖమును రక్షించుగాక.
పాతు కంఠే మహామాయా హృది మాహేశ్వరీ తథా |
త్రిపుష్పా పార్శ్వయోః పాతు గుదే కామేశ్వరీ మమ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మహామాయాదేవి నా కంఠమును రక్షించుగాక; మాహేశ్వరీదేవి నా హృదయమును రక్షించుగాక; త్రిపుష్పాదేవి నా రెండు పార్శ్వములను (పక్కలను) రక్షించుగాక; కామేశ్వరీదేవి నా గుదస్థానమును రక్షించుగాక.
VERSE #7
ఊరుద్వయే తథా చండీ జంఘయోశ్చ హరప్రియా |
మహామాయా పాదయుగ్మే సర్వాంగేషు కులేశ్వరీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
చండీదేవి నా రెండు తొడలను రక్షించుగాక; హరప్రియాదేవి నా రెండు పిక్కలను రక్షించుగాక; మహామాయాదేవి నా రెండు పాదములను రక్షించుగాక; కులేశ్వరీదేవి నా సర్వాంగములను రక్షించుగాక.
VERSE #8
అంగం ప్రత్యంగకం చైవ సదా రక్షతు వైష్ణవీ |
బ్రహ్మరంధ్రే సదా రక్షేన్మాతంగీ నామ సంస్థితా ||
📖తాత్పర్యం / Meaning & Significance
వైష్ణవీదేవి ఎల్లప్పుడూ నా అంగప్రత్యంగములను రక్షించుగాక; మాతంగీ అను నామముతో నిలిచియున్న దేవి నా బ్రహ్మరంధ్రమును సదా రక్షించుగాక.
VERSE #9
రక్షేన్నిత్యం లలాటే సా మహాపిశాచినీతి చ |
నేత్రాయోః సుముఖీ రక్షేద్దేవీ రక్షతు నాసికామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మహాపిశాచినీదేవి నా లలాటమును (నుదురును) నిత్యము రక్షించుగాక; సుముఖీదేవి నా రెండు నేత్రములను రక్షించుగాక; ఆ దేవి నా నాసికను రక్షించుగాక.
VERSE #10
మహాపిశాచినీ పాయాన్ముఖే రక్షతు సర్వదా |
లజ్జా రక్షతు మాం దంతాన్ చోష్ఠౌ సమ్మార్జనీకరీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
మహాపిశాచినీదేవి నా ముఖమును సర్వదా రక్షించుగాక; లజ్జాదేవి నా దంతములను రక్షించుగాక; సమ్మార్జనీకరీదేవి నా రెండు పెదవులను రక్షించుగాక.
VERSE #11
చిబుకే కంఠదేశే తు ఠకారత్రితయం పునః |
సవిసర్గం మహాదేవి హృదయం పాతు సర్వదా ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ మహాదేవీ! చుబుకమునందు, కంఠప్రదేశమునందు మరల మూడు ‘ఠ’ కారములు, విసర్గసహితముగా (ఉంచి రక్షించవలెను); ఆ మంత్రము నా హృదయమును సర్వదా రక్షించుగాక.
VERSE #12
నాభిం రక్షతు మాం లోలా కాలికావతు లోచనే |
ఉదరే పాతు చాముండా లింగే కాత్యాయనీ తథా ||
📖తాత్పర్యం / Meaning & Significance
లోలాదేవి నా నాభిని రక్షించుగాక; కాలికాదేవి నా రెండు కన్నులను రక్షించుగాక; చాముండాదేవి నా ఉదరమును రక్షించుగాక; కాత్యాయనీదేవి నా లింగస్థానమును రక్షించుగాక.
VERSE #13
ఉగ్రతారా గుదే పాతు పాదౌ రక్షతు చాంబికా |
భుజౌ రక్షతు శర్వాణీ హృదయం చండభూషణా ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఉగ్రతారాదేవి నా గుదస్థానమును రక్షించుగాక; అంబికాదేవి నా పాదములను రక్షించుగాక; శర్వాణీదేవి నా భుజములను రక్షించుగాక; చండభూషణాదేవి నా హృదయమును రక్షించుగాక.
VERSE #14
జిహ్వాయాం మాతృకా రక్షేత్పూర్వే రక్షతు పుష్టికా |
విజయా దక్షిణే పాతు మేధా రక్షతు వారుణే ||
📖తాత్పర్యం / Meaning & Significance
మాతృకాదేవి నా జిహ్వను రక్షించుగాక; పుష్టికాదేవి తూర్పు దిక్కున రక్షించుగాక; విజయాదేవి దక్షిణ దిక్కున రక్షించుగాక; మేధాదేవి పడమటి (వరుణ) దిక్కున రక్షించుగాక.
VERSE #15
నైరృత్యాం సుదయా రక్షేద్వాయవ్యాం పాతు లక్ష్మణా |
ఐశాన్యాం రక్షేన్మాం దేవీ మాతంగీ శుభకారిణీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
సుదయాదేవి నైరృతి దిక్కున రక్షించుగాక; లక్ష్మణాదేవి వాయవ్య దిక్కున రక్షించుగాక; శుభకారిణియైన మాతంగీదేవి ఈశాన్య దిక్కున నన్ను రక్షించుగాక.
VERSE #16
రక్షేత్సురేశీ చాగ్నేయ్యాం బగలా పాతు చోత్తరే |
ఊర్ధ్వం పాతు మహాదేవీ దేవానాం హితకారిణీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
సురేశీదేవి ఆగ్నేయ దిక్కున రక్షించుగాక; బగలాదేవి ఉత్తర దిక్కున రక్షించుగాక; దేవతలకు హితమును కలిగించు మహాదేవి ఊర్ధ్వదిక్కున (పైభాగమున) రక్షించుగాక.
VERSE #17
పాతాలే పాతు మా నిత్యం వశినీ విశ్వరూపిణీ |
ప్రణవం చ తమోమాయా కామబీజం చ కూర్చకమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
విశ్వరూపిణియైన వశినీదేవి పాతాళదిక్కున (క్రిందిభాగమున) నన్ను నిత్యము రక్షించుగాక. ప్రణవము (ఓంకారము), తమోమాయ, కామబీజము, కూర్చబీజము –
VERSE #18
మాతంగినీ ఙేయుతాస్త్రం వహ్నిజాయావధిర్మనుః |
సార్ధైకాదశవర్ణా సా సర్వత్ర పాతు మాం సదా ||
📖తాత్పర్యం / Meaning & Significance
మాతంగినీ బీజము, అస్త్రబీజము, వహ్నిజాయ (అగ్నిపత్ని/స్వాహా), అవధిర్మనుః (మనుసంఖ్యాక అక్షరము) – ఇవి కలిపి పదకొండున్నర అక్షరములుగా ఏర్పడిన ఆ మంత్రస్వరూపిణి సర్వత్ర నన్ను సదా రక్షించుగాక.
VERSE #19
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరమ్ |
త్రైలోక్యమంగళం నామ కవచం దేవదుర్లభమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ దేవీ! ఇట్లు రహస్యములలోకెల్లా అతిరహస్యమైనదానిని, పరమమైనదానిని నీకు చెప్పితిని. దేవతలకు కూడా దుర్లభమైన ఈ కవచము మూడు లోకములకును మంగళము కలిగించునది.
VERSE #20
య ఇదం ప్రపఠేన్నిత్యం జాయతే సంపదాలయమ్ |
పరమైశ్వర్యమతులం ప్రాప్నుయాన్నాత్ర సంశయః ||
📖తాత్పర్యం / Meaning & Significance
దీనిని ఎవడు నిత్యము చదువునో వానికి సంపదలు నిలయమగును; సాటిలేని పరమైశ్వర్యమును పొందును – ఇందు సందేహము లేదు.
VERSE #21
గురుమభ్యర్చ్య విధివత్కవచం ప్రపఠేద్యది |
ఐశ్వర్యం సుకవిత్వం చ వాక్సిద్ధిం లభతే ధ్రువమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
గురువును యథావిధిగా పూజించి ఈ కవచమును పఠించినచో ఐశ్వర్యము, సుకవిత్వము, వాక్సిద్ధి తప్పక లభించును.
VERSE #22
నిత్యం తస్య తు మాతంగీ మహిలా మంగలం చరేత్ |
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ యే దేవాః సురసత్తమాః ||
📖తాత్పర్యం / Meaning & Significance
అట్టివానికి మాతంగీదేవి నిత్యము మంగళమును చేయును. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మరియు ఇతర శ్రేష్ఠదేవతలు అందరూ (అతనికి అనుకూలురగుదురు).
VERSE #23
బ్రహ్మరాక్షసవేతాలా గ్రహాద్యా భూతజాతయః |
తం దృష్ట్వా సాధకం దేవి లజ్జాయుక్తా భవంతి తే ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ దేవీ! బ్రహ్మరాక్షసులు, వేతాళములు, గ్రహములు మొదలైన సమస్త భూతజాతులు ఆ సాధకుని చూచి సిగ్గుపడి (దూరముగా) పోవును.
VERSE #24
కవచం ధారయేద్యస్తు సర్వసిద్ధిం లభేద్ధ్రువమ్ |
రాజానో'పి చ దాసాః స్యుః షట్కర్మాణి చ సాధయేత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఈ కవచమును ధరించువాడు నిశ్చయముగా సర్వసిద్ధిని పొందును. రాజులు కూడా అతనికి దాసులవలె నుందురు; షట్కర్మలను సాధించగలడు.
VERSE #25
సిద్ధో భవతి సర్వత్ర కిమన్యైర్బహుభాషితైః |
ఇదం కవచమజ్ఞాత్వా మాతంగీం యో భజేన్నరః ||
📖తాత్పర్యం / Meaning & Significance
అతడు సర్వత్ర సిద్ధుడగును – ఇక ఎక్కువ మాటలతో పనేమి? ఈ కవచమును తెలుసుకొనకుండా మాతంగీదేవిని ఎవడు భజించునో,
VERSE #26
అల్పాయుర్నిర్ధనో మూర్ఖో భవత్యేవ న సంశయః |
గురౌ భక్తిః సదా కార్యా కవచే చ దృఢా మతిః ||
VERSE #27
తస్మై మాతంగినీ దేవీ సర్వసిద్ధిం ప్రయచ్ఛతి ||
📖తాత్పర్యం / Meaning & Significance
వాడు అల్పాయుష్కుడు, నిర్ధనుడు, మూర్ఖుడు అగుననుటలో సందేహము లేదు. కావున గురువునందు సదా భక్తిని, కవచమునందు దృఢమైన విశ్వాసమును కలిగియుండవలెను. అట్టివానికి మాతంగినీదేవి సర్వసిద్ధిని ప్రసాదించును.
VERSE #28
ఇతి నంద్యావర్తే ఉత్తరఖండే మాతంగినీ కవచమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
: పైన ఇవ్వబడిన స్తోత్రము (
) , ఈ పుస్తకములో కూడా ఉన్నది.
(నిత్య పారాయణ గ్రంథము)
దశమహావిద్యా స్తోత్రాలు
🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Sri Matangini Kavacham (Trailokya Mangala Kavacham) represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.