Sri Durga Arya Stavam

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
🪔

Recitation & Chanting Guidelines

⏰ Best Chanting Time Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or Sandhya Kaala
🗓️ Auspicious Timing Daily Morning / Evening Sandhya
🔢 Recommended Count 1, 11, or 21 Times
✨ Key Spiritual Benefits Inner Peace, Spiritual Protection, Divine Grace & Prosperity
VERSE #1
[గమనిక: ఈ స్తోత్రము
(పాండవుల రక్షణార్థం, ధర్మ రక్షణార్థం కృష్ణుడు ఆదిశక్తిని ప్రార్థించినప్పుడు వైశంపాయన మహర్షి జనమేజయునికి ఈ స్తోత్రాన్ని వివరించారు. ఈ స్తోత్రం పారాయణ చేయడం వల్ల భయం తొలగిపోతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఆపదల్లో ఉన్నప్పుడు రక్షణనిచ్చే కవచంలా పనిచేస్తుంది.)
వైశంపాయన ఉవాచ |
ఆర్యాస్తవం ప్రవక్ష్యామి యథోక్తమృషిభిః పురా |
నారాయణీం నమస్యామి దేవీం త్రిభువనేశ్వరీమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
వైశంపాయనుడు పలికెను – పూర్వం మహర్షులు ఏ విధంగానైతే వర్ణించారో, అటువంటి ‘ఆర్యా స్తవాన్ని’ నీకు వివరిస్తాను. నారాయణుని శక్తివైన నారాయణిని, ముల్లోకాలకు ఈశ్వరివైన త్రిభువనేశ్వరిని నేను నమస్కరిస్తున్నాను.
VERSE #2
త్వం హి సిద్ధిర్ధృతిః కీర్తిః శ్రీర్విద్యా సన్నతిర్మతిః |
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా కాలరాత్రిస్తథైవ చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
దేవీ! నీవే కార్యసిద్ధివి (సిద్ధి), ధైర్యానివి (ధృతి), కీర్తివి మరియు సంపదవు (శ్రీ). నీవే విద్యవు, వినయానివి (సన్నతి) మరియు బుద్ధివి (మతి). సంధ్యా కాలం, రాత్రి, కాంతి (ప్రభా), నిద్ర మరియు భయంకరమైన కాలరాత్రివి కూడా నీవే.
VERSE #3
ఆర్యా కాత్యాయనీ దేవీ కౌశికీ బ్రహ్మచారిణీ |
జననీ సిద్ధసేనస్య ఉగ్రచారీ మహాబలా ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవు పూజ్యురాలైన ఆర్యవు, కాత్యాయనీ దేవివి, కౌశికివి మరియు బ్రహ్మచారిణివి. కుమారస్వామికి (సిద్ధసేనుడు) తల్లివి, ఉగ్రమైన పరాక్రమముతో సంచరించే మహా బలశాలివి నీవే.
VERSE #4
జయా చ విజయా చైవ పుష్టిస్తుష్టిః క్షమా దయా |
జ్యేష్ఠా యమస్య భగినీ నీలకౌశేయవాసినీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవే జయవు మరియు విజయవు. నీవే పుష్టిని, తుష్టిని, క్షమను మరియు దయను ఇచ్చే దానవు. యమధర్మరాజుకు జ్యేష్ఠ సోదరివి (కాళీ రూపం) మరియు నీలిరంగు పట్టువస్త్రాలను (నీల కౌశేయము) ధరించేదానవు.
VERSE #5
బహురూపా విరూపా చ అనేకవిధిచారిణీ |
విరూపాక్షీ విశాలాక్షీ భక్తానాం పరిరక్షిణీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవు అనేక రూపాలు కలదానవు (బహురూప), భయంకరమైన రూపాలు కలదానవు (విరూప) మరియు అనేక రకాలైన కార్యాలను నిర్వహించేదానవు. మూడు కన్నులు కలిగిన విరూపాక్షివి, విశాలమైన నేత్రాలు కలిగిన విశాలాక్షివి అయిన నీవు నీ భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తావు.
VERSE #6
పర్వతాగ్రేషు ఘోరేషు నదీషు చ గుహాసు చ |
వాసస్తే చ మహాదేవి వనేషూపవనేషు చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ మహాదేవీ! భయంకరమైన పర్వత శిఖరాలపై, నదుల తీరాలలో, పర్వత గుహలలో నీవు నివసిస్తావు. దట్టమైన అడవుల్లో, తోటల్లో (ఉపవనములు) నీవు కొలువై ఉంటావు.
VERSE #7
శబరైర్బర్బరైశ్చైవ పులిందైశ్చ సుపూజితా |
మయూరపిచ్ఛధ్వజినీ లోకాన్ క్రమసి సర్వశః ||
📖తాత్పర్యం / Meaning & Significance
శబరులు, బర్బరులు, పులిందులు వంటి గిరిజన తెగలచే నీవు నిరంతరం పూజించబడతావు. నెమలి పించమును ధ్వజముగా (జెండాగా) కలిగి, సకల లోకాలలో సర్వవ్యాప్తమై సంచరిస్తావు.
VERSE #8
కుకుటైశ్ఛాగలైర్మేషైః సింహైర్వ్యాఘ్రైః సమాకులా |
ఘంటానినాదబహులా వింధ్యవాసిన్యభిశ్రుతా ||
📖తాత్పర్యం / Meaning & Significance
కోళ్లు, మేకలు, గొర్రెలు, సింహాలు మరియు పులులతో పరివేష్ఠించబడి ఉంటావు. పెద్ద పెద్ద ఘంటానాదాల మధ్య వింధ్య పర్వతాలపై నివసించే ‘వింధ్యవాసిని’గా నీవు ప్రసిద్ధి చెందావు.
VERSE #9
త్రిశూలీ పట్టిశధరా సూర్యచంద్రపతాకినీ |
నవమీ కృష్ణపక్షస్య శుక్లస్యైకాదశీ తథా ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవు త్రిశూలాన్ని, పట్టిశం అనే ఆయుధాన్ని ధరిస్తావు. నీ జెండాపై సూర్యచంద్రుల చిహ్నాలు ఉంటాయి. తిథులలో కృష్ణపక్ష నవమి మరియు శుక్లపక్ష ఏకాదశి రూపాలు నీవే.
VERSE #10
భగినీ బలదేవస్య రజనీ కలహప్రియా |
ఆవాసః సర్వభూతానాం నిష్ఠా చ పరమా గతిః ||
📖తాత్పర్యం / Meaning & Significance
బలరామునికి సోదరివి, చీకటి (రజని) వంటి వర్ణం కలదానవు. అసురులతో కలహాన్ని కోరుకునే దానవు. సమస్త ప్రాణులకు నివాసానివి, ప్రళయ కాలంలో చివరి గమ్యాన్ని ఇచ్చే పరమ గతివి నీవే.
VERSE #11
నందగోపసుతా చైవ దేవానాం విజయావహా |
చీరవాసాః సువాసాశ్చ రౌద్రీ సంధ్యాచరీ నిశా ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీవు నందగోపుని కుమార్తెవు (యోగాంశ), దేవతలకు విజయాన్ని చేకూర్చే దానవు. నార వస్త్రాలను (చీర) మరియు ఉత్తమమైన వస్త్రాలను (సువాస) ధరిస్తావు. రౌద్ర రూపిణివి, సంధ్యా కాలంలో, రాత్రి సమయంలో సంచరించే శక్తివి నీవే.
VERSE #12
ప్రకీర్ణకేశీ మృత్యుశ్చ సురామాంసబలిప్రియా |
లక్ష్మీరలక్ష్మీరూపేణ దానవానాం వధాయ చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
విరబోసిన కేశాలు కలిగిన మృత్యు స్వరూపిణివి. దానవులను సంహరించడం కోసం దేవతల కొరకు లక్ష్మిగా, దానవుల కొరకు అలక్ష్మిగా (దురదృష్టం) మారుతావు.
VERSE #13
సావిత్రీ చాపి దేవానాం మాతా మంత్రగణస్య చ |
కన్యానాం బ్రహ్మచర్యా త్వం సౌభాగ్యం ప్రమదాసు చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
దేవుళ్లకు సావిత్రివి (గాయత్రి), సమస్త మంత్ర సమూహాలకు తల్లివి నీవే. కన్యలలో బ్రహ్మచర్య శక్తివి, సువాసినులలో (ప్రమదలు) సౌభాగ్య శక్తివి నీవే.
VERSE #14
అంతర్వేదీ చ యజ్ఞానామృత్విజాం చైవ దక్షిణా |
కర్షకాణాం చ సీతేతి భూతానాం ధరణీతి చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
యజ్ఞాలలోని అంతర్వేదివి (యజ్ఞ వేదిక) నీవే. ఋత్విజులకు ఇచ్చే దక్షిణవు నీవే. రైతులకు నాగలి చాలు (సీత) వంటి ఆధారం నీవే. సమస్త ప్రాణులను భరించే భూదేవివి నీవే.
VERSE #15
సిద్ధిః సాంయాత్రికాణాం తు వేలా త్వం సాగరస్య చ || |
యక్షాణాం ప్రథమా యక్షీ నాగానాం సురసేతి చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
సముద్ర ప్రయాణం చేసే వర్తకులకు నీవే విజయానివి (సిద్ధి). సముద్రానికి తీరానివి (వేలా) నీవే. యక్షులలో మొదటిదైన యక్షిణివి నీవే. నాగులలో సురసవు (నాగమాత) నీవే.
VERSE #16
బ్రహ్మవాదిన్యథో దీక్షా శోభా చ పరమా తథా |
జ్యోతిషాం త్వం ప్రభా దేవి నక్షత్రాణాం చ రోహిణీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
బ్రహ్మజ్ఞానుల నోట పలికే వేదవాక్కువు నీవే. దీక్షవు నీవే. పరమ శోభవు నీవే. జ్యోతులన్నింటిలో కాంతివి (ప్రభ) నీవే. నక్షత్రాలలో రోహిణివి నీవే.
VERSE #17
రాజద్వారేషు తీర్థేషు నదీనాం సంగమేషు చ |
పూర్ణా చ పూర్ణిమా చంద్రే కృత్తివాసా ఇతి స్మృతా ||
📖తాత్పర్యం / Meaning & Significance
రాజద్వారాల వద్ద, పుణ్య తీర్థాల వద్ద, నదీ సంగమ స్థలాల వద్ద నీవే కొలువై ఉంటావు. చంద్రునిలోని పూర్ణత్వం నీవే. పౌర్ణమివి నీవే. చర్మ వస్త్రాన్ని (కృత్తివాస) ధరించిన దేవిగా నీవు కీర్తించబడతావు.
VERSE #18
సరస్వతీ చ వాల్మీకే స్మృతిర్ద్వైపాయనే తథా |
ఋషీణాం ధర్మబుద్ధిస్తు దేవానాం మానసీ తథా ||
📖తాత్పర్యం / Meaning & Significance
వాల్మీకి మహర్షిలో సరస్వతీ శక్తివి నీవే. వ్యాస మహర్షిలో (ద్వైపాయనుడు) స్మృతి శక్తివి నీవే. ఋషులలో ధర్మ బుద్ధివి, దేవతలలో మానసిక శక్తివి నీవే.
VERSE #19
సురా దేవీ తు భూతేషు స్తూయసే త్వం స్వకర్మభిః |
ఇంద్రస్య చారుదృష్టిస్త్వం సహస్రనయనేతి చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
సమస్త భూతకోటిలో దేవతవు నీవే. ప్రతి ఒక్కరూ వారి వారి కర్మల ద్వారా నిన్నే స్తుతిస్తారు. ఇంద్రునిలో వేయి కన్నుల రూపంలో ఉండే చారుదృష్టివి (అందమైన చూపు) నీవే.
VERSE #20
తాపసానాం చ దేవీ త్వమరణీ చాగ్నిహోత్రిణామ్ |
క్షుధా చ సర్వభూతానాం తృప్తిస్త్వం దైవతేషు చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
తపస్సు చేసేవారికి తపశ్శక్తివి నీవే. అగ్నిహోత్రం చేసేవారికి అరణివి (అగ్నిని పుట్టించే కట్టె) నీవే. ప్రాణులన్నింటిలో ఆకలివి నీవే. దేవతలలో తృప్తివి నీవే.
VERSE #21
స్వాహా తృప్తిర్ధృతిర్మేధా వసూనాం త్వం వసూమతీ |
ఆశా త్వం మానుషాణాం చ పుష్టిశ్చ కృతకర్మణామ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
స్వాహాకారం, తృప్తి, ధైర్యం, మేధాశక్తి నీవే. వసువులలో భూమివి (వసూమతి) నీవే. మానవులలో ఆశవు నీవే. కర్మలు చేసేవారిలో లభించే పుష్టివి నీవే.
VERSE #22
దిశశ్చ విదిశశ్చైవ తథా హ్యగ్నిశిఖా ప్రభా |
శకునీ పూతనా త్వం చ రేవతీ చ సుదారుణా ||
📖తాత్పర్యం / Meaning & Significance
దిక్కులు, విదిక్కులు నీవే. అగ్ని శిఖలోని ప్రకాశం నీవే. శకుని, పూతన, దారుణమైన రేవతి వంటి శక్తి రూపాలన్నీ నీవే. (ఇవి మాతృకా శక్తి రూపాలు).
VERSE #23
నిద్రాపి సర్వభూతానాం మోహినీ క్షత్రియా తథా |
విద్యానాం బ్రహ్మవిద్యా త్వమోంకారో'థ వషట్ తథా ||
📖తాత్పర్యం / Meaning & Significance
సమస్త ప్రాణులలో నిద్రవు నీవే. లోకాన్ని భ్రమింపజేసే మోహినివి నీవే. విద్యలన్నింటిలో బ్రహ్మవిద్యవు నీవే. మంత్రాలలోని ఓంకారము, వషట్కారము నీవే.
VERSE #24
నారీణాం పార్వతీం చ త్వాం పౌరాణీమృషయో విదుః |
అరుంధతీ చ సాధ్వీనాం ప్రజాపతివచో యథా ||
📖తాత్పర్యం / Meaning & Significance
స్త్రీలలో పురాణ ప్రసిద్ధురాలైన పార్వతివి నీవే అని ఋషులు చెబుతారు. పతివ్రతలలో నీవే అరుంధతివని బ్రహ్మదేవుని (ప్రజాపతి) వచనం.
VERSE #25
పర్యాయనామభిర్దివ్యైరింద్రాణీ చేతి విశ్రుతా |
త్వయా వ్యాప్తమిదం సర్వం జగత్ స్థావరజంగమమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
అనేక దివ్య నామములతో నీవు ఇంద్రాణిగా ప్రసిద్ధి చెందావు. ఈ చరాచర జగత్తు అంతా నీ చేతనే వ్యాపించబడి ఉంది.
VERSE #26
సంగ్రామేషు చ సర్వేషు అగ్నిప్రజ్వలితేషు చ |
నదీతీరేషు చౌరేషు కాంతారేషు భయేషు చ ||
📖తాత్పర్యం / Meaning & Significance
యుద్ధాల సమయంలో, అగ్ని ప్రమాదాల సమయంలో, నదీ తీరాల వద్ద, దొంగల భయం ఉన్నప్పుడు, అడవులలో, భయానక పరిస్థితుల్లో, …
VERSE #27
ప్రవాసే రాజబంధే చ శత్రూణాం చ ప్రమర్దనే |
ప్రయాణాద్యేషు సర్వేషు త్వం హి రక్షా న సంశయః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ప్రవాసంలో ఉన్నప్పుడు, రాజుల బందీగా ఉన్నప్పుడు, శత్రు సంహార సమయంలో మరియు ప్రయాణాల సమయంలో.. నీవే రక్షగా ఉంటావు, ఇందులో ఎటువంటి సందేహం లేదు.
VERSE #28
త్వయి మే హదయం దేవి త్వయి చిత్తం మనస్త్వయి |
రక్ష మాం సర్వపాపేభ్యః ప్రసాదం కర్తుమర్హసి ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఓ దేవీ! నా హృదయం నీయందే ఉంది. నా చిత్తం, నా మనస్సు నీవే. నన్ను సమస్త పాపాల నుండి రక్షించు. నాపై అనుగ్రహాన్ని (ప్రసాదం) చూపుము.
VERSE #29
ఇమం యః సుస్తవం దివ్యమితి వ్యాసప్రకల్పితమ్ |
యః పఠేత్ ప్రాతరుత్థాయ శుచిః ప్రయతమానసః ||
📖తాత్పర్యం / Meaning & Significance
వ్యాస మహర్షిచే కూర్చబడిన ఈ దివ్యమైన స్తోత్రాన్ని, ఎవరైతే ప్రాతఃకాలమే నిద్రలేచి, శుచిగా, ఏకాగ్రతతో పఠిస్తారో వారికి …
VERSE #30
త్రిభిర్మాసైః కాంక్షితం చ ఫలం వై సంప్రయచ్ఛసి |
షడ్భిర్మాసైర్వరిష్ఠం తు వరమేకం ప్రయచ్ఛసి ||
📖తాత్పర్యం / Meaning & Significance
… మూడు నెలల కాలంలోనే వారు కోరుకున్న (కాంక్షితం) ఫలితము లభిస్తుంది. ఆరు నెలల పాటు నిరంతరం పఠించే వారికి శ్రేష్ఠమైన ఒకానొక వరాన్ని దేవి ప్రసాదిస్తుంది.
VERSE #31
అర్చితా తు త్రిభిర్మాసైర్దివ్యం చక్షుః ప్రయచ్ఛసి |
సంవత్సరేణ సిద్ధిం తు యథాకామం ప్రయచ్ఛసి ||
📖తాత్పర్యం / Meaning & Significance
మూడు నెలల పాటు భక్తితో దేవిని అర్చించిన వారికి ఆమె దివ్య చక్షువును (జ్ఞాన నేత్రం లేదా దివ్య దృష్టి) ప్రసాదిస్తుంది. ఒక సంవత్సరం పాటు ఈ సాధన చేసిన వారికి వారు కోరుకున్న విధంగా సంపూర్ణ సిద్ధి లభిస్తుంది.
VERSE #32
సత్యం బ్రహ్మ చ దివ్యం చ ద్వైపాయనవచో యథా |
నృణాం బంధం వధం ఘోరం పుత్రనాశం ధనక్షయమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
వేదవ్యాసుని (ద్వైపాయన) వాక్కు ప్రకారం ఇది సత్యం, బ్రహ్మతుల్యం మరియు దివ్యమైనది. నిన్ను పూజించిన వారికి ఎదురయ్యే బందీఖానా వాసం (బంధం), ఘోరమైన మరణ భయం (వధ), పుత్రులను కోల్పోవడం, ధన నష్టం, …
VERSE #33
వ్యాధిమృత్యుభయం చైవ పూజితా శమయిష్యసి |
భవిష్యసి మహాభాగే వరదా కామరూపిణీ ||
📖తాత్పర్యం / Meaning & Significance
… వ్యాధులు మరియు మృత్యువు వంటి భయాలను నీవు ఉపశమింపజేస్తావు. ఓ మహాభాగే! నీవు కోరిన రూపం ధరించగలవు (కామరూపిణి) మరియు భక్తులకు వరాలనిచ్చే వరదాయినిగా ప్రసిద్ధి చెందుతావు.
VERSE #34
మోహయిత్వా చ తం కంసమేకా త్వం భోక్ష్యసే జగత్ |
అహమప్యాత్మనో వృత్తిం విధాస్యే గోషు గోపవత్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
(శ్రీకృష్ణుడు దేవికి చెబుతున్నాడు) నీవు నీ మాయతో ఆ కంసుడిని మోహింపజేసి, ఈ జగత్తునంతటినీ ఏకచ్ఛత్రాధిపత్యంగా అనుభవిస్తావు (లేదా రక్షిస్తావు). నేను కూడా నా కార్యము కొరకు గోపాలుని వలె ఆవుల మధ్య సంచరిస్తూ నా వృత్తిని నిర్వహిస్తాను.
VERSE #35
స్వవృద్ధ్యర్థమహం చైవ కరిష్యే కంసగోపతామ్ |
ఏవం తాం స సమాదిశ్య గతోంతర్ధానమీశ్వరః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ధర్మ వృద్ధి కోసం నేను కంసుని వద్ద గోపాలునిగా ఉండి నా బాధ్యతను నెరవేరుస్తాను. ఈ విధంగా ఆ ఈశ్వరుడు (కృష్ణుడు) ఆమెకు (దేవికి) దిశానిర్దేశం చేసి, అక్కడే అంతర్ధానమయ్యాడు.
VERSE #36
సా చాపి తం నమస్కృత్య తథాస్త్వితి చ నిశ్చితా |
యశ్చైతత్పఠతే స్తోత్రం శృణుయాద్వాప్యభీక్ష్ణశః |
సర్వార్థసిద్ధిం లభతే నరో నాస్త్యత్ర సంశయః ||
📖తాత్పర్యం / Meaning & Significance
ఆ దేవి కూడా కృష్ణుడికి నమస్కరించి, ఆయన చెప్పినట్లే జరుగుతుందని నిశ్చయించుకుంది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారో లేదా నిరంతరం వింటారో, ఆ మనుషులు సకల పురుషార్థాలను (సర్వార్థ సిద్ధి) పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
VERSE #37
ఇతి శ్రీమహాభారతే ఖిలభాగే హరివంశే విష్ణుపర్వణి తృతీయో'ధ్యాయే ఆర్యా స్తవమ్ ||
📖తాత్పర్యం / Meaning & Significance
: పైన ఇవ్వబడిన స్తోత్రము
, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
(నిత్య పారాయణ గ్రంథము)
🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Sri Durga Arya Stavam represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.